అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. ఆమె పాలిట ఆలస్యమే అమృతం.. ఏం జరిగిందంటే!
గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి లండన్ బయల్దేరిన ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ-171 విమానం నిన్న కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 241 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. రన్‌వే నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ విమానం ప్రమాదానికి గురైంది.
ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది మనసులను కలచివేసిన ఘటన
అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కూలిన ఘటనపై, విమాన ప్రమాద దర్యాప్తు బ్యూరో - AAIB, దర్యాప్తు ప్రారంభించినట్టు పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు తెలిపారు. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ ప్రొటోకాల్స్ ప్రకారం ఈ దర్యాప్తు జరుగుతుందని చెప్పారు. ఎయిర్ ఇండియాకు సంబంధించిన ఈ విమాన ప్రమాద ఘటన ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది మనసులను కలచివేసింది. ఎన్నో కుటుంబాలలో తీరని వేదన మిగిల్చింది.

10 నిమిషాల ఆలస్యం ఓ యువతి ప్రాణాలను కాపాడింది
అయితే ఈ విమాన ప్రమాదానికి సంబంధించి ఒక 10 నిమిషాల ఆలస్యం ఓ యువతి ప్రాణాలను కాపాడింది. భారీ ట్రాఫిక్ లో ఇరుకున్న ఓ యువతి అహ్మదాబాద్ విమాన ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. భూమి చౌహన్ అనే యువతి అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లడానికి ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఏఐ-171ను బుక్ చేసుకుంది అయితే విమానాశ్రయానికి చేరుకునే క్రమంలో ఆమె ట్రాఫిక్ లో ఇరుక్కు పోవడంతో పదినిమిషాలు ఆలస్యమైంది.
ఫ్లైట్ మిస్ అయిన యువతి
దీంతో అప్పటికే ఫ్లైట్ టేక్ ఆఫ్ కాగా ఆమె తన ఫ్లైట్ ను మిస్సయింది. తాను తన ఫ్లైట్ ను మిస్ అయ్యానని తీవ్ర ఆవేదనకు గురైన కాసేపట్లోనే ఒళ్ళు గగుర్పొడిచే సంఘటన తన చెవిన పడింది. ఈ సంఘటనకు సంబంధించి ఆమె సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది.
సోషల్ మీడియా వేదికగా పోస్ట్
"నేను వెళ్లాల్సిన విమానం కుప్పకూలింది అనే విషయం తెలిసిన వెంటనే షాక్కు గురయ్యా.. ఆ ఘటన గురించి తలుచుకుంటే నా శరీరం వణికి పోతుంది .. మాట్లాడలేకపోతున్నా.. నా మైండ్ బ్లాక్ అయిపోయింది . ఆ దేవుడికి ధన్యవాదాలు.. నా గణపతి బప్పే నన్ను కాపాడాడు" అంటూ భూమి చౌహన్ ఆ పోస్టులో పేర్కొంది. పదినిమిషాల ఆలస్యంతో నేను ఫ్లైట్ ఎక్కలేక పోయాను అని ఆమె పేర్కొంది.
ఆమె పాలిట ఆలస్యమే అమృతం
భూమి చౌహాన్ లండన్ లో భర్తతో కలిసి ఉంటుంది. రెండేళ్ళ తర్వాత వెకేషన్ కోసం ఆమె ఇండియాకు వచ్చింది. ఆమె 10 నిమిషాలు ఆలస్యం కావడం వల్ల తన ఫ్లైట్ ను మిస్సయింది. అతి భయంకరమైన ప్రమాదం నుంచి బయటపడింది. ఇక ఈ ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత ఆమె ఆ ప్రమాదాన్ని ఏ విధంగా వర్ణించాలో అర్థం కావడం లేదంటూ పేర్కొంది. ఒక్కోసారి భూమి చౌహాన్ లాంటి వారికి ఆలస్యం అమృతం విషం కాదు.. ఆలస్యమే అమృతం అని కూడా చెప్పాలని ఇలాంటి ఘటనలతో అనిపిస్తుంది.












Click it and Unblock the Notifications