వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీకి జయలలిత షాకిచ్చారా?: ఫలితాల్ని బట్టి అడుగు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jayalalithaa
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడిఎంకె అధినేత్రి జయలలిత భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీకి షాకిచ్చారు. ఇటీవల కొంతకాలంగా ఆమె తీరు ఎన్డీయే వైపు వెళ్తున్నట్లుగా కనిపించింది. తమిళనాడు, గుజరాత్ ఎన్నికల్లో జయలలిత, మోడీలు గెలిచినప్పుడు ప్రమాణ స్వీకారానికి ఇరువురు పరస్పరం ఆహ్వానించుకున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల నాటికి జయలలిత ఎన్డీయే వైపు వెళ్తారని భావించారు. బిజెపి కూడా జయలలిత పైన ఆశలు పెట్టుకుంది.

అయితే, కాంగ్రెసేతర, బిజెపియేతర పార్టీలన్నింటిని ఒక్కతాటి పైకి తెస్తూ లెఫ్ట్ పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో జయలలిత చేరిపోయారు. 2014 ఎన్నికల్లో అన్నాడిఎంకె లెఫ్ట్ పార్టీలతో కలిసి వెళ్లాలని నిర్ణయించుకుంది.

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడిఎంకె, సిపిఎం మధ్య ఎన్నికల పొత్తు సోమవారం కుదిరింది. సిపిఎంతో కుదిరిన పొత్తుపై అన్నాడిఎంకె అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత హర్షం వ్యక్తం చేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పని చేయాలని నిర్ణయించడం తనకెంతో సంతోషాన్నిచ్చిందని, ఈ పొత్తు ఘన విజయాన్ని సాధించి పెడుతుందన్నారు.

సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్‌తో కలిసి జయలలిత పొత్తు విషయాన్ని వెల్లడించారు. తమిళనాడులో తమ పొత్తు సత్ఫలితాలను ఇస్తుందని కారత్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ యేతర, బిజెపి యేతర పక్షాలను ఒకే వేదిక పైకి తీసుకొచ్చి సరైన ప్రత్యామ్నయం చూపుతుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి అభ్యర్థి ఎవరన్న ప్రశ్నకు ఫలితాల తర్వాత నిర్ణయం ఉంటుందని చెప్పారు. ఆదివారమే సిపిఐ, అన్నాడిఎంకె మధ్య ఎన్నికల పొత్తు కుదిరింది. తమిళనాడులో వామపక్ష పార్టీలు 2011 ఎన్నికల నుంచి అన్నాడిఎంకెతో వెళ్తున్నాయి. ఇంతకుముందు అన్నాడిఎంకెతో కలిసి పనిచేసిన మణిధనేయ మక్కల్ కచ్చి, పుతియా తమిఝగం బయటకు వెళ్లిపోయి డిఎంకెతో పొత్తు పెట్టుకున్నాయి.

బిజెపికి షాకిచ్చినట్లేనా..

జయలలిత ఇప్పుడే పూర్తిగా బిజెపికి దూరమైనట్లుగా భావించవచ్చునని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. 2014 ఎన్నికలకు లెఫ్ట్ పార్టీలతో కలిసి వెళ్తున్నప్పటికీ ఎన్నికల ఫలితాలను బట్టి ఆమె నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. థర్డ్ ఫ్రంట్ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంటే ఆమె అటువైపు మొగ్గుచూపినా, ఎన్డీయే ఢిల్లీ పీఠం కైవసం చేసుకునే పరిస్థితిలో ఉంటే మాత్రం ఆమె మోడీకి మద్దతిచ్చే అవకాశాలే ఎక్కువగా ఉంటాయంటున్నారు. ఫలితాలను బట్టి ఆమె ముందడుగు వేస్తారంటున్నారు. అయితే ఎన్నికల్లో కలిసి వెళ్లాలనే బిజెపి ఆలోచనలకు మాత్రం జయలలిత చెక్ చెప్పిందని అంటున్నారు.

English summary
Amid indications of full emergence of the 'Third Front', a day after forming pre-poll alliance with the CPI, AIADMK supremo Jayalalithaa on Monday announced another alliance with the CPI (M), ahead of Lok Sabh elections 2014.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X