వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శశికళ కథ క్లోజ్: రిసార్ట్ లో ఎమ్మెల్యేలు, దుమ్ములేపిన మన్నార్ గుడి గ్యాంగ్

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు సీఎం కావాలని ఆశపడుతున్న శశికళకకు పూర్తిగా చెక్ పెట్టేయాలని ప్రజలు నిర్ణయించారు. ఇప్పుడు శశికళ వర్గీయులైన మన్నార్ గుడి గ్యాంగ్ చేస్తున్న ఆగడాలకు అడ్డూఅదుపులేకుండా పోయింది. కొందరు ప్రభుత్వ పెద్దల అండచూసుకుని మన్నార్ గుడి గ్యాంగ్ రెచ్చిపోతోంది.

రాజీకి వచ్చిన శశికళ: పన్నీర్ సెల్వం ఇంటికి పరుగు తీసి వెళ్లి!రాజీకి వచ్చిన శశికళ: పన్నీర్ సెల్వం ఇంటికి పరుగు తీసి వెళ్లి!

అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను బుధవారం రాత్రి రిసార్ట్ లకు తీసుకు వెళ్లిన విషయం తెలిసిందే. వారిలో కొందరు ఎమ్మెల్యేలను కూవత్తూరులోని ఓ రిసార్ట్ లో పెట్టారు. గురువారం మద్నాహ్నం రిసార్ట్ సమీపంలో ఉంటున్న ప్రజలు అటు వైపు వెళ్లారు.

AIADMK MLAs jailed in koovathoor resort by the mannarkudi team.

అంతే వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని మన్నార్ గుడి గ్యాంగ్ బెదిరించింది. మా ప్రాంతంలో మేము సంచరించడానికి మీ పెత్తనం ఏమిటీ అని స్థానికులు ప్రశ్నించారు. ఈ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తే పరిస్థితులు వేరుగా ఉంటాయని మన్నార్ గుడి గ్యాంగ్ హెచ్చరించింది..

శశికళకు షాక్: మెరీనా బీచ్ సాక్షిగా మరో పోరాటం: యువత వార్నింగ్!శశికళకు షాక్: మెరీనా బీచ్ సాక్షిగా మరో పోరాటం: యువత వార్నింగ్!

స్థానికులు ఎదురు తిరగడంతో రెచ్చిపోయిన మన్నార్ గుడి గ్యాంగ్ స్థానికులను పట్టుకుని చితకబాదేశారు. చేతికి చిక్కిన వస్తువులతో విచక్షణారహితంగా దాడి చేశారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని స్థానిక ప్రజలకు సర్ది చెప్పారు.

మన్నార్ గుడి గ్యాంగ్ ను అరెస్టు చెయ్యాలని, లేదంటే ఆందోళనకు దిగుతామని స్థానికులు హెచ్చరించారు. ఈ దెబ్బతో రిసార్ట్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శశికళ ఈ జన్మలో తమిళనాడుకు సీఎం కాలేరని స్థానికులు శాపనార్థాలు పెడుతున్నారు.

English summary
AIADMK MLAs jailed in koovathoor resort by the mannarkudi team. Public are restricted to the koovathoor resort area. Mannarkudi gang members beat the public and traced away from the area.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X