వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజీకి వచ్చిన శశికళ: పన్నీర్ సెల్వం ఇంటికి పరుగు తీసి వెళ్లి !

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు అపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అన్నాడీఎంకే పార్టీ చీఫ్ శశికళకు చుక్కలు చూపిస్తున్నారు. గంటలకు ఒక ట్వీస్ట్ ఇవ్వడంతో శశికళ వర్గీయులు హడలిపోతున్నారు. ఇక లాభం లేదని రాజీకావాలని చర్చలు మొదలు పెడుతున్నారు.

<strong>ఆట మొదలైంది: పన్నీర్ కు 22 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేల మద్దతు!</strong>ఆట మొదలైంది: పన్నీర్ కు 22 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేల మద్దతు!

గురువారం మద్యాహ్నం అన్నాడీఎంకే పార్టీ ప్రిసీడియం చెర్మన్ మదుసూధనన్ చెన్నైలోని తమిళనాడు అపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఇంటికి వెళ్లారు. ఇద్దరూ ఏకాంతంగా చర్చలు జరిపారు. ఆ సమయంలో పన్నీర్ సెల్వం వర్గీయులు ఇంటి బయటే వేచి ఉన్నారు.

శశికళకు అత్యంత సన్నిహితుడైన మదుసూధనన్ చిన్నమ్మ మీద తిరుగుబాటు చేసిన పన్నీర్ సెల్వం ఇంటికి ఎందుకు వెళ్లారు ? అని ఇప్పుడు తమిళనాట చర్చ మొదలైయ్యింది. మంగళవారం రాత్రి నుంచి పన్నీర్ సెల్వం అన్నాడీఎంకే చీఫ్ మీద విరుచుకుపడుతున్నారు.

AIADMK Presidium Chairman Madhusoodanan today met CM of TN Panneerselvam in his residence.

<strong>శశికళకు షాక్: మెరీనా బీచ్ సాక్షిగా మరో పోరాటం: యువత వార్నింగ్!</strong>శశికళకు షాక్: మెరీనా బీచ్ సాక్షిగా మరో పోరాటం: యువత వార్నింగ్!

శశికళకు మూడు చెరువుల నీళ్లు తాగించి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఈ దెబ్బతో ఉక్కిరిబిక్కిరి అయిన శశికళ చివరికి పన్నీర్ సెల్వం దగ్గరకు మదుసూధనన్ తో రాయభారం పంపించారు. అయితే ఇప్పటికే ప్రజామద్దతు కూడగడుతున్న పన్నీర్ సెల్వం మాత్రం వెనక్కి తగ్గే పరిస్థితి లేదని ఆయన వర్గీయులు అంటున్నారు.

శశికళకు అత్యంత సన్నిహితుడైన మదుసూధన్ పన్నీర్ సెల్వంతో ఏం మాట్లాడారు ? శశికళ రాజీకి వచ్చారా ? పన్నీర్ సెల్వంను మన్నార్ గుడి మాఫియా గ్యాంగ్ మళ్లీ బయటపెట్టటానికి ప్రయత్నిస్తుందా ? అంటూ తమిళనాడు ప్రజలు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు.

English summary
AIADMK Presidium Chairman Madhusoodanan today met Chief Minsiter of Tamil Nadu O Panneerselvam in his residence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X