జయలలిత చేసే ఇంటర్వ్యూలో గెలిస్తే ఎమ్మెల్యే టిక్కెట్
చెన్నై: అన్నాడిఎంకె అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత.. తమ పార్టీ తరఫున టిక్కెట్లు ఇచ్చేందుకు కొత్త పంథాలో వెళ్తున్నారు. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిల్లో శాసనసభ్యులుగా పోటీ చేయదలచుకున్నవారు కేవలం దరఖాస్తు చేసుకుంటే సరిపోదు.. 'అమ్మ' చేసే ఇంటర్వ్యూలో విజయం సాధించాలి.
జయలలిత సమక్షంలో ఆదివారం ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు అన్నాడిఎంకె ఓ ప్రకటనలో తెలిపింది. ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని జనవరిలోనే జయలలిత ఒక ప్రకటన చేశారు. ఫిబ్రవరి ఆరో తేదీ వరకు గడువు విధిస్తే దాదాపు 26 వేల దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.

అభ్యర్థులను ఇంటర్వ్యూ చేస్తున్నసమయంలో పార్టీ ప్రిసీడియం చైర్మన్ మధుసూదన్, పార్టీ పార్లమెంటరీ బోర్డు మెంబర్లు జస్టిస్ సెల్వరాజ్, తమిళ్ మహన్ హుస్సేన్ తదితరులు కూడా ఉన్నారు. సోమవారం కూడా కొందరిని ఇంటర్వ్యూ చేశారు.













Click it and Unblock the Notifications