టి: ఆరుగురు ఎంపీలకు కాంగ్ షాక్, పాసులు నిరాకరణ

 AICC rejected passes to 6 MPs
న్యూఢిల్లీ: తెలంగాణ అంశంలో విభేదిస్తూ సొంత ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టిన సీమాంధ్ర ప్రాంత పార్లమెంటు సభ్యులకు కాంగ్రెసు పార్టీ గురువారం షాక్ ఇచ్చింది. శుక్రవారం ఏఐసిసి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఆరుగురు ఎంపీలకు పాసులు నిరాకరించారు.

ఏఐసిసి సమావేశంలో గొడవ చేయవచ్చుననే కారణంతో వారిని సమావేశానికి దూరంగా ఉంచాలని పార్టీ అధిష్టానం నిర్ణయించుకుంది. ఎంపీలు లగడపాటి రాజగోపాల్, రాయపాటి సాంబశివ రావు, ఉండవల్లి అరుణ్ కుమార్, సాయి ప్రతాప్, సబ్బం హరి, హర్ష కుమార్‌లకు పాసులు నిరాకరించారు.

కాగా, ఏఐసిసి సమావేశంలో తమ గళం వినిపించేందుకు ఎంపీలు సిద్ధమైన సమయంలో వారికి పార్టీ షాకిచ్చింది. ఈ సమావేశంలో సమైక్య గళం వినిపిస్తే అధిష్ఠానానికి సీమాంధ్ర ప్రజల మనోగతం తెలుస్తుందని ఆ ఎంపీలు వ్యూహరచన చేశారు.

ఏఐసిసి సదస్సులో రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించకముందే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ నినాదాలతో హోరెత్తిస్తామని లగడపాటి తెలిపారు. మిగిలిన ఎంపీలు కూడా అదే చెప్పారు.

ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తారనే..

ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తారనే ఆశతోనే తాము సమావేశానికి వచ్చామని మంత్రి కొండ్రు మురళి అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎలాంటి అసంతృప్తితో లేరని, ఆయన సమావేశానికి వస్తారని, రాకపోతే అధిష్టానానికి సమాచారం ఇస్తారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+