వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జమ్మూ కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్: అగ్రనేత అన్సర్ గజ్వాతుల్‌తో సహా ఆరుగురు ఉగ్రవాదులు హతం

|
Google Oneindia TeluguNews

జమ్ము కశ్మీర్‌లో మరోసారి తుపాకుల మోత మోగింది. పుల్వామా జిల్లాలోని ట్రాల్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో కార్డన్ సెర్చ్ నిర్వహించాయి భద్రతా దళాలు. ఉగ్రవాదులకు భద్రతాదళాల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. ఈ ఘటనలో ఉగ్రవాద సంస్థ జకీర్ మూసాకు చెందిన అగ్రనేత అన్సర్ గజ్వాతుల్ హింద్ మృతి చెందాడు.

ఎన్‌కౌంటర్ తర్వాత ఘటనా స్థలం నుంచి పెద్ద ఎత్తున పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు ఐజీ స్వయం ప్రకాష్ పాని చెప్పారు. ఘటనలో చనిపోయిన ఉగ్రవాదులు ఏ సంస్థకు చెందినవారో ఇంకా గుర్తించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ట్రాల్ ప్రాంతంలోని అరంపోరా గ్రామంలో భద్రతాదళాలు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించాయి. ఉగ్రవాదులు ఆ గ్రామంలో నక్కిఉన్నారన్న సమాచారాన్ని భద్రతాదళాలకు ఇంటెలిజెన్స్ వర్గాలు అందించడంతో ఉగ్రవాదుల కోసం ఆగ్రామన్ని సైన్యం జల్లెడ పట్టిందని పోలీస్ అధికారులు తెలిపారు.

Aide of Kashmirs wanted terrorist among 6 killed in Pulwama encounter

భద్రతాదళాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఇది గమనించిన ఉగ్రవాదులు వెంటనే వారిపైకి కాల్పులు జరిపారు ఉగ్రవాదులు. అలర్ట్ అయిన భద్రతాదళాలు కూడా ఎదురుకాల్పులకు దిగడంతో ఆరుగురు ఉగ్రవాదులు మృతి చెందారు.

English summary
Six terrorists were gunned down by security forces during an encounter in south Kashmir's Pulwama district.An aide of Zakir Musa, one of Kashmir's most wanted terrorist, was also killed in the encounter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X