Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

షాకింగ్ : కోవిడ్ నుంచి కోలుకున్నాక అసాధారణ స్థాయిలో సుగర్ లెవల్స్-ఎయిమ్స్ సర్వేలో వెల్లడి

కోవిడ్‌కి సంబంధించి ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(ఎయిమ్స్)-పాట్నా షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. కరోనా సెకండ్ వేవ్‌లో వైరస్ బారినపడినవారిలో.. రక్తంలో సుగర్ లెవల్స్ అసాధారణ స్థాయిలో పెరిగినట్లు గుర్తించామని తెలిపింది. కోవిడ్ నుంచి కోలుకున్న అనంతరం వీరిలో ఈ లక్షణాలు గుర్తించినట్లు స్పష్టం చేసింది. ఇటీవల నిర్వహించిన టెలీఫోనిక్ సర్వే ద్వారా కోవిడ్ నుంచి రికవరీ అయిన 3వేల మంది నుంచి అభిప్రాయాలు సేకరించి ఈ నిర్దారణకు వచ్చినట్లు వెల్లడించింది.

సర్వేలో ఇంకా ఏం తేలిందంటే...

సర్వేలో ఇంకా ఏం తేలిందంటే...

కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత... వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునేందుకు దాదాపు 3వేల మందితో ఫోన్ ద్వారా మాట్లాడామని ఎయిమ్స్ డా.అనిల్ కుమార్ తెలిపారు. టెలీఫోనిక్ సర్వే సందర్భంగా కనీసం 11 రకాల ఆరోగ్య సమస్యలపై వారిని వాకబు చేశామని చెప్పారు. సర్వేలో మొత్తం 3వేల మంది పాల్గొనగా... ఇందులో 480 మంది లేదా 16 శాతం మంది కోవిడ్ నుంచి కోలుకున్న అనంతరం రక్తంలో సుగర్ లెవల్స్ పెరిగాయని చెప్పారన్నారు. మరో 840 మంది లేదా 28 శాతం మంది బలహీనత వంటి సమస్యలతో బాధపడుతున్నట్లు చెప్పారని తెలిపారు. మరో 636 మంది లేదా 21.2 శాతం మంది నీరసంతో బాధపడుతున్నట్లు గుర్తించామన్నారు.

ఇతర సమస్యలతో బాధపడుతున్నవారు...

ఇతర సమస్యలతో బాధపడుతున్నవారు...

ఇదే టెలీఫోనిక్ సర్వేలో మరికొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. కోవిడ్ నుంచి కోలుకున్నవారు దగ్గు (474 ​​మంది లేదా 15.8 శాతం మంది), శ్వాస సమస్య (150 లేదా 5 శాతం), గ్యాంగ్రేన్ (10 మంది లేదా 0.33 శాతం), రక్తపోటు (210 మంది లేదా 7 శాతం), బ్లాక్ ఫంగస్ ( 5 లేదా 0.16 శాతం), ఆందోళన,దడ (120 మంది లేదా 4 శాతం) వంటి మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించారు. కోవిడ్ నుంచి కోలుకున్నవారిలో ఇప్పటికే కొంతమంది బ్లాక్ ఫంగస్ బారినపడుతున్న సంగతి తెలిసిందే. తాజా సర్వేలో సుగర్ లెవల్స్ కూడా పెరుగుతున్నాయని తేలడం ఆందోళన కలిగించే అంశం.

ఎయిడ్స్ పేషెంట్లు... అంతగా కోవిడ్ బారినపడలేదు

ఎయిడ్స్ పేషెంట్లు... అంతగా కోవిడ్ బారినపడలేదు

పాట్నాలోని ఎయిమ్స్ వైద్యులు హెచ్ఐవి,ఎయిడ్స్‌ పేషెంట్లపై కూడా సర్వే చేశారు. మిగతా జనాభాతో పోలిస్తే హెచ్ఐవి,ఎయిడ్స్ పేషెంట్లు అంతగా కోవిడ్ బారినపడలేదని నిర్దారించారు. గతేడాది సెప్టెంబర్-నవంబర్ మధ్యలో 164 మంది హెచ్ఐవి,ఎయిడ్స్ పేషెంట్ల రక్త నమూనాలను సేకరించి అధ్యయనం చేశారు. సగటున 41 ఏళ్ల వయసున్న వారి శాంపిల్స్‌ను ఇందుకోసం సేకరించారు. ఈ అధ్యయనంలో 164 మందికి గాను కేవలం 23 మంది(14శాతం)లో యాంటీబాడీలను గుర్తించారు. మిగతా 86 శాతం మందిలో యాంటీబాడీలు లేవని గుర్తించారు. కోవిడ్ బారినపడినవారిలో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయన్నది అందరికీ తెలిసిందే. ఎయిమ్స్ అధ్యయనంలో దాదాపు 86శాతం మంది హెచ్ఐవి,ఎయిడ్స్ పేషెంట్లలో యాంటీబాడీలు బయటపడలేదు కాబట్టి... వారు కోవిడ్ బారినపడలేదని అక్కడి వైద్యులు నిర్దారించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+