Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆ విమానం టిక్కెట్‌ బుక్ చేసినా.. రైల్లో వెళ్లిన రవీంద్ర గైక్వాడ్‌!

తన సిబ్బందిపై దాడి చేసిన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌పై విధించిన నిషేధాన్ని ఎత్తివేసిన నేపథ్యంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. సోమవారం ఢిల్లీ వెళ్లేందు ఎయిరిండియా విమాన టికెట్‌ బుక్‌ చేసుకున్న శివసేన

న్యూఢిల్లీ: తన సిబ్బందిపై దాడి చేసిన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌పై విధించిన నిషేధాన్ని ఎత్తివేసిన నేపథ్యంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. సోమవారం ఢిల్లీ వెళ్లేందు ఎయిరిండియా విమాన టికెట్‌ బుక్‌ చేసుకున్న శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌.. ఆ విమానంలో వెళ్లకుండా రైల్లో వెళ్లినట్లు తెలిసింది.

గైక్వాడ్‌ పుణె నుంచి రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ఢిల్లీ వెళ్లినట్లు ఆయన బావ ద్వారా తెలిసింది. శుక్రవారం గైక్వాడ్‌పై నిషేధం ఎత్తివేయడంతో ఎయిరిండియాతో వివాదం సద్దుమణిగిన విషయం తెలిసిందే. దీంతో గైక్వాడ్‌ సోమవారం పుణె నుంచి ఢిల్లీ వెళ్లేందుకు ఎయిరిండియా విమానం ఏఐ852లో బిజినెస్‌ క్లాస్‌ టికెట్‌ బుక్‌ చేసుకున్నారు.

Air India lifts travel ban on Ravindra Gaikwad, but Shiv Sena MP takes train to Delhi

కాగా, షెడ్యూల్‌ ప్రకారం సోమవారం ఉదయం 7.40 గంటలకు పుణె నుంచి విమానంలో ఢిల్లీకి బయల్దేరాల్సి ఉంది. కారణమేంటో తెలియదు గానీ.. గైక్వాడ్‌ విమానం ఎక్కకుండా రైల్లో వెళ్లారు. ఆయన ఆదివారం పుణె నుంచి రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ఢిల్లీ బయల్దేరినట్లు ఆయన బంధువు వెల్లడించారు.

మార్చి నెలలో ఈ ఏఐ852 విమానంలోనే గైక్వాడ్‌, ఎయిరిండియా సిబ్బందికి మధ్య వివాదం చోటుచేసుకుంది. తనకు బిజినెస్‌ క్లాస్‌ టికెట్‌ ఇవ్వలేదన్న కోపంతో ఎయిరిండియా సిబ్బందిని గైక్వాడ్‌ చెప్పుతో కొట్టారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన సదరు ఎయిర్‌లైన్‌ ఆయనను నిషేధిత జాబితాలో చేర్చింది. అయితే ఈ ఘటనలో శివసేన ఎంపీలు ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తేవడంతో గత శుక్రవారం ఆయనపై నిషేధం ఎత్తివేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+