ఎయిర్ ఇండియా న్యూయార్క్- ఢిల్లీ విమానం 300మంది ప్రయాణికులతో స్వీడన్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్!!

ఎయిర్ ఇండియా న్యూయార్క్- ఢిల్లీ విమానం స్వీడన్‌లో అత్యవసర ల్యాండింగ్ అయింది. ఫ్లైట్ లో 300మందికి ప్రమాదం తప్పింది.

దాదాపు 300 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఎయిర్ ఇండియా న్యూయార్క్ ఢిల్లీ ఫ్లైట్ కు పెను ప్రమాదం తప్పింది. విమాన పైలెట్ అప్రమత్తం కావడంతో 300 మంది ప్రయాణికులు సురక్షితంగా పెను ప్రమాదం నుండి బయట పడ్డారు. నేడు ఢిల్లీ నుండి యూఎస్ న్యూయార్క్ ప్రయాణికులతో బయలుదేరిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో స్వీడన్ లోని స్టాక్ హోమ్ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ అయింది.

బోయింగ్ 777 -300ER తో నడిచే ఈ విమానం ఇంజన్లో ఒక దానిలో ఆయిల్ లీక్ కావడంతో, ప్రమాదాన్ని గుర్తించిన పైలెట్ విమానాన్ని దారి మళ్ళించి స్వీడన్ లో అత్యవసర ల్యాండింగ్ చేశారు. దీంతో ప్రయాణికులు అందరూ పెను ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు. విమానాన్ని అత్యవసర లాండింగ్ చేయడంతో, ఏదైనా ఎమర్జెన్సీ తలెత్తుతుందేమోనన్న క్రమంలో పెద్ద సంఖ్యలో అగ్నిమాపక యంత్రాలను స్వీడన్ లోని స్టాక్ హోమ్ విమానాశ్రయంలో ఉంచినట్టు సమాచారం.

Air India Newark-Delhi flight makes emergency landing in Sweden with 300 passengers!!

అయితే ఆయిల్ లీక్ కారణంగా ఇంజన్ షడ్ డౌన్ అయిందని ఆ తర్వాత విమానం స్టాక్ హోమ్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయిందని, ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోలేదని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ప్రయాణికులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. విమానంలో ఇంజన్ నుండి ఆయిల్ లీకేజ్ కు సంబంధించి కారణాలను పరిశీలిస్తున్నామని ఇంజిన్ టూ యొక్క డ్రెయిన్ మాస్ట్ నుండి ఆయిల్ బయటకు రావడానికి గల కారణాలపై తనిఖీ పురోగతిలో ఉందని అధికారి తెలిపారు. మొత్తానికి పైలెట్ అప్రమత్తతతో 300 మంది పెను ప్రమాదం నుండి బయటపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+