ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్

ఎయిర్ ఇండియా విమానంలో బాంబ్ బెదిరింపుల వేళ ఆ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ధమ్మం నుంచి న్యూ దిల్లీకి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో బాంబ్ ఉన్నట్లు ఆ విమానంలోని వాష్ రూమ్ లో లభ్యమైన నాప్ కిన్ పై రాసి ఉంది. వెంటనే అప్రమత్తమైన విమాన సిబ్బంది. ఈ విషయానికి పైలట్ కు చేరవేశారు. దాంతో పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ విభాగానికి సమాచారం పంపాడు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు అనుమతి కోరాడు. అక్కడి నుంచి అనుమతి రావడంతో ఎయిర్ ఇండియా విమానాన్ని అహ్మదాబాద్ లో అత్యవసరంగా నిలిపివేశారు. వెంటనే బాంబ్‌ స్క్వాడ్ వచ్చి తనిఖీ చేయగా ఎలాంటి అనుమానాస్పద వస్తువులు దొరకకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దాంతో విమానంలోని 32 మంది ప్రయాణికులు సురక్షితంగానే బయటపడ్డారు.

దేశంలో ఇటీవలికాలంలో విమానాలకు బాంబు బెదిరింపు ఘటనలు అధికం అవుతున్నాయి. తాజాగా మరో ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపులు రావడం సంచలనంగా మారింది. ఇవాళ ఉదయం 10 గంటల 25 నిమిషాలకు మొత్తం 32 మందితో ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా విమానం సౌదీ అరేబియాలోని దమ్మమ్ నుంచి న్యూ దిల్లీకి బయల్దేరింది. అయితే విమానంలోని టాయిలెట్ లో BOMB అని రాసి ఉన్న ఓ నాప్‌కిన్ సిబ్బందికి దొరికింది. దాంతో అప్రమత్తమైన సిబ్బంది పైలట్ కు సమాచారం ఇవ్వడం.. ఆ పైలట్ ఏటీసీ అనుమతితో అహ్మదాబాద్ లోని సర్ధార్ వల్లభ్ భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ప్రయాణికులందరినీ విమానంలోని టెర్మినల్ 2 కు సురక్షితంగా తరలించారు. అయితే బాంబ్ స్క్వాడ్ నిర్వహించిన తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లభ్యం కాలేదు. క్యాబిన్, సీట్లు, కార్గో ఇలా విమానం మొత్తం జల్లెడ పట్టారు. కానీ వారికి ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభ్యం కాలేదు. ఈ మేరకు ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

AirIndia Bomb threat to Air India flight carrying 32 passengers emergency landing in Ahmedabad

ఈ ఘటనపై ఎయిర్ ఇండియా సంస్థకు చెందిన ఓ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. ధమ్మన్ నుంచి దిల్లీకి బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానాన్ని ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అహ్మదాబాద్ విమానాశ్రయానికి మళ్లించాం. బాంబు ఉన్నట్లు వచ్చిన బెదిరింపుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రభుత్వం ఏర్పాటు చేసిన బాంబ్ త్రెట్ అసెస్ మెంట్ కమిటీని వెంటనే అలర్ట్ చేశాం. ప్రస్తుతం ప్రయాణికులంతా సురక్షితంగానే ఉన్నారు.. అని ఆయన స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+