Ajit Doval: భారత్ నష్టపోయినట్లు ఒక్క ఫోటో చూపించండి.. అజిత్ ధోవల్ సవాల్

Ajit Doval: భారత జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ) అజిత్ ధోవల్ పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా భారత్ చేపట్టిన "ఆపరేషన్ సింధూర్" పై విదేశీ మీడియా తప్పుదోవ పట్టించే కవరేజీని విమర్శించారు. ఈ ఆపరేషన్‌లో పాకిస్థాన్, పీఓకేలోని 9 ఉగ్రవాద స్థావరాలను అత్యంత కచ్చితత్వంతో లక్ష్యంగా చేసుకున్నామని అజిత్ ధోవల్ వెల్లడించారు. భారత్ వైపు ఎక్కడైనా నష్టం జరిగినట్లు ఒక్క ఫోటో చూపించాలని విదేశీ మీడియాకు సవాల్ విసిరారు.

ఐఐటీ మద్రాస్ 62వ స్నాతకోత్సవంలో అజిత్ ధోవల్ మాట్లాడుతూ.."మనం మన దేశీయ సాంకేతికతను అభివృద్ధి చేసుకోవాలి. ఇక్క ఆపరేషన్ సింధూర్ ప్రస్తావన వచ్చింది. దేశీయంగా ఎంత కంటెంట్ ఉందనేది మనకు చాలా గర్వకారణం. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత ప్రాంతాల్లోని 9 ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాం. దీనిని వదలకుండా ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించాం. అవి ఎక్కడ ఉన్నాయో మాకు తెలుసు. మొత్తం ఆపరేషన్ 23 నిమిషాలు పట్టింది." అని అజిత్ ధోవల్ తెలిపారు.

Ajit Doval Challenges Foreign Media Over Operation Sindhoor Show One Photo of Indian Damage

సోషల్ మీడియాలో విదేశీ వార్తా సంస్థలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని అజిత్ ధోవల్ కొట్టిపడేశారు. భారత్ వైపు ఎక్కడైనా నష్టం జరిగిందని చూపే ఒక్క ఫోటో చూపించాలని ఛాలెంజ్ విసిరారు. కానీ మే 10కి ముందు, ఆ తర్వాత పాకిస్థాన్‌లోని 13 వైమానిక స్థావరాలను చూపించే చిత్రాలు మాత్రమే ఉన్నాయన్నారు. విదేశీ పత్రికలు పాకిస్థాన్ ఇది చేసింది.. అది చేసిందని రాశాయని.. భారత నిర్మాణాలకు ఒక్క గీత కూడా పడలేదని.. కనీసం ఒక గాజు పలక కూడా పగలలేదన్నారు. ఆ ఫోటోలు మే 10కి ముందు, ఆ తర్వాత పాకిస్థాన్‌లోని సర్గాదా, రహీమ్ యార్ ఖాన్, చక్లాలా వంటి 13 వైమానికి స్థావరాలను మాత్రమే చూపించాయన్నారు.

మే 7న ప్రారంభించిన ఆపరేషన్ సింధూర్.. పహల్గామ్‌లో పాకిస్థాన్ మద్దతుతో జరిగిన ఉగ్రదాడికి భారత్ ఇచ్చిన గట్టి ప్రతీకారం. పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా భారత వైమానిక దళం పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని జైష్-ఏ-మహమ్మద్ ప్రధాన కార్యాలయం, లష్కర్-ఇ-తొయిబా ముఖ్య స్థావం మురీద్‌కేతో సహా 9 కీలక ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. దీనికి ప్రతిస్పందనగా పాకిస్థాన్ డ్రోన్లు, క్షిపణి దాడులతో ఎదురుదాడికి ప్రయత్నించింది. అయితే వాటన్నింటినీ భారత వైమానిక రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+