మహారాష్ట్ర సీఎం రేసులో బిగ్ ట్విస్ట్-అజిత్ కింగ్ మేకర్ గా ఆయనే సీఎం..!
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి సాధించిన ఘన విజయం తర్వాత 72 గంటల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన పరిస్ధితి తలెత్తింది. మహా రాష్ట్ర అసెంబ్లీ గడువు ఇప్పటికే ముగియడంతో ఇవాళ ఎట్టి పరిస్ధితుల్లోనూ ప్రభుత్వ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోక తప్పడం లేదు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రకు కొత్త సీఎంగా ఎవరికి ఛాన్స్ దక్కబోతోందన్న ఉత్కంఠ నెలకొంది. ఇలాంటి సమయంలో భారీ ట్విస్ట్ ఎదురైంది.
మహారాష్ట్ర సీఎంగా గత మూడేళ్లుగా అధికారం చెలాయించిన ఏక్ నాథ్ షిండే కు తిరిగి పగ్గాలు అప్పగించాలని ఆయన పార్టీ నేతలు కోరుతుండగా.. బీజేపీ మాత్రం ఇందుకు ససేమిరా అంటోంది. 132 సీట్లు సాధించిన తమను కాదని సీఎం పదవిని 50 సీట్లు సాధించిన శివసేనకు ఎలా ఇస్తామని ప్రశ్నిస్తోంది. దీంతో గత మూడేళ్లలో షిండే పాలన వల్లే తిరిగి తాము అధికారంలోకి వచ్చామని శివసేన గుర్తుచేస్తోంది. ఈ తరుణంలో సీఎం రేసులో లేని మరో భాగస్వామి అజిత్ పవార్ కీలకంగా మారారు.

మహారాష్ట్ర కొత్త సీఎం ఎంపికలో అజిత్ పవార్ కీలకంగా మారారు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఆయనే కీంగ్ మేకర్. ఎలాగో సీఎం కాలేని పరిస్ధితుల్లో కొత్త ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ కు అండగా నిలవడం ద్వారా ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం సహా కీలక పదవులు తీసుకోవాలని అజిత్ పవార్ పట్టుదలగా ఉన్నారు. దీంతో షిండేకు బీజేపీతో కలిసి షాకివ్వాలని అజిత్ పవార్ భావిస్తున్నారు. అదే జరిగితే ఇవాళ సాయంత్రానికి ఫడ్నవీస్ సీఎంగా ఎంపికకావడం లాంఛనంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications