అజిత్ పవార్ కన్నుమూత: పొట్టన పెట్టుకున్న విమాన ప్రమాదం
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అజిత్ పవార్ వర్గం) అధినేత, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కన్నుమూశారు. ఆయన ప్రయాణిస్తోన్న విమానం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయనతో పాటు విమానంలో ప్రయాణిస్తోన్న మరో ముగ్గురు కూడా మరణించారు. ఆయన ప్రయాణిస్తోన్న విమానం కొద్దిసేపటి కిందటే మహారాష్ట్రలోని బారామతిలో కుప్పకూలింది. క్రాష్ ల్యాండింగ్ కు గురైంది. సంఘటన స్థలం నుంచి పెద్ద ఎత్తున పొగ రావడాన్ని చూసినట్లు స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
అజిత్ పవార్‌కు చెందిన ప్రైవేట్ విమానం అది. కొద్దిసేపటి కిందటే బారామతి సమీపంలో కుప్ప కూలిపోయింది. ఈ ప్రమాదం ల్యాండింగ్ సమయంలో సంభవించిందని ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి అజిత్ పవార్ ఈ తెల్లవారు జామున బారామతికి బయలుదేరారు. బారామతికి సమీపించిన అనంతరం ఇందులో సాంకేతిక లోపాలు తలెత్తాయి. దీంతో పైలెట్ ఈ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో విమానం క్రాష్ ల్యాండింగ్ అయింది.

ప్రమాదం సంభవించిన వెంటనే విమానం పొలాల్లో పడింది. మంటల్లో చిక్కుకుంది. సంఘటనా స్థలం నుండి వెలువడిన చిత్రాలు భయానకంగా ఉన్నాయి. దట్టమైన పొగతో పాటు విమానం పెద్ద ఎత్తున కాలిపోతున్న దృశ్యాలు వీడియోల్లో కనిపించాయి. పూర్తిగా కాలి బూడిదైన విమానం శకలాలు చెల్లాచెదురుగా పడి ఉన్నట్లు దృశ్యాలు స్పష్టంగా ఉన్నాయి ఇందులో. ప్రమాదం క్రాష్ ల్యాండింగ్ వల్ల జరిగిందా, లేక సాంకేతిక లోపం వల్ల జరిగిందా అనేది ఇంకా నిర్ధారణ కాలేదు.
సమాచారం అందుకున్న వెంటనే స్థానిక ప్రజలు, అధికారులు, సహాయక బృందాలు ప్రమాద స్థలానికి చేరుకున్నాయి. భారీ సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకుని రెస్క్యూ ప్రయత్నాల్లో పాలుపంచుకుంటున్నారు. అంబులెన్స్‌లు, ఇతర వైద్య సహాయక బృందాలను కూడా హుటాహుటిన సంఘటనా స్థలానికి పంపినట్లు అధికారులు తెలిపారు. కాగా ఈ ప్రమాదంలో అజిత్ పవార్ తో పాటు మరో ముగ్గురు కన్నుమూశారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications