BREAKING: కుప్పకూలిన డిప్యూటీ సీఎం ప్రయాణిస్తోన్న విమానం: భయానకం.. కాలి బూడిద
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అజిత్ పవార్ వర్గం) అధినేత, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తోన్న విమానానికి ప్రమాదం సంభవించింది. క్రాష్ ల్యాండింగ్ కు గురైంది. మహారాష్ట్రలోని బారామతిలో కొద్దిసేపటి కిందటే ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియరావాల్సి ఉంది. సంఘటన స్థలం నుంచి పెద్ద ఎత్తున పొగ రావడాన్ని చూసినట్లు స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
అజిత్ పవార్‌కు చెందిన ప్రైవేట్ విమానం అది. కొద్దిసేపటి కిందటే బారామతి సమీపంలో కుప్ప కూలిపోయింది. ఈ ప్రమాదం ల్యాండింగ్ సమయంలో సంభవించిందని ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి అజిత్ పవార్ ఈ తెల్లవారు జామున బారామతికి బయలుదేరారు. బారామతికి సమీపించిన అనంతరం ఇందులో సాంకేతిక లోపాలు తలెత్తాయి. దీంతో పైలెట్ ఈ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో విమానం క్రాష్ ల్యాండింగ్ అయింది.

ప్రమాదం సంభవించిన వెంటనే విమానం పొలాల్లో పడింది. మంటల్లో చిక్కుకుంది. సంఘటనా స్థలం నుండి వెలువడిన చిత్రాలు భయానకంగా ఉన్నాయి. దట్టమైన పొగతో పాటు విమానం పెద్ద ఎత్తున కాలిపోతున్న దృశ్యాలు వీడియోల్లో కనిపించాయి. పూర్తిగా కాలి బూడిదైన విమానం శకలాలు చెల్లాచెదురుగా పడి ఉన్నట్లు దృశ్యాలు స్పష్టంగా ఉన్నాయి ఇందులో. ప్రమాదం క్రాష్ ల్యాండింగ్ వల్ల జరిగిందా, లేక సాంకేతిక లోపం వల్ల జరిగిందా అనేది ఇంకా నిర్ధారణ కాలేదు.
సమాచారం అందుకున్న వెంటనే స్థానిక ప్రజలు, అధికారులు, సహాయక బృందాలు ప్రమాద స్థలానికి చేరుకున్నాయి. భారీ సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకుని రెస్క్యూ ప్రయత్నాల్లో పాలుపంచుకుంటున్నారు. అంబులెన్స్‌లు, ఇతర వైద్య సహాయక బృందాలను కూడా హుటాహుటిన సంఘటనా స్థలానికి పంపినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి, ఈ ప్రమాదంలో ఎవరెవరికి గాయాలయ్యాయో స్పష్టంగా తెలియరాలేదు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications