Ajit Pawar: అజిత్ పవార్ ఆస్తులు, అప్పుల విలువ ఎంతో తెలుసా?
Ajit Pawar: అజిత్ పవార్. మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనం. దేశ రాజకీయాల్లోనూ ప్రత్యేక గుర్తింపు ఉన్న నాయకత్వం. విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మరణించారు. ఆయన వయస్సు 66 సంవత్సరాలు. మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదిగారు. ఆరుసార్లు ఉప ముఖ్యమంత్రిగా పని చేసి కొత్త రికార్డు నెలకొల్పారు. వారసత్వం.. అరుదైన నాయకత్వానికి చిరునామాగా నిలిచిన అజిత్ పవార్ ఆస్తులు..అప్పుల లెక్కలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించటంతో అందరూ ఒక్క సారిగా షాక్ కు గురయ్యారు. మహారాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన అజిత్ పవార్ ఎన్సీపీలో కీలకంగా వ్యవహరించారు.ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం మహారాష్ట్రలోని బారామతిలో ల్యాండ్ అవుతుండగా విమానం కూలిపోయింది. దివంగత అజిత్ పవర్ అత్యధిక సార్లు మహారాష్ట్ర డిప్యూటీ సిఎంగా పనిచేసిన రికార్డు ఆయన సొంతం. అయితే, అజిత్ పవార్ ఆస్తులు.. అప్పుల గురించి ఇప్పుడు చర్చ జరుగుతోంది.

సుదీర్ఘ కాలం రాజకీయాల్లో... పవార్ కుటుంబ సభ్యుడిగా అజిత్ కు ఆస్తులు.. అప్పుల గురించి తన ఎన్నికల అఫిడవిట్ లో వివరించారు. 2024లో జరిగిన ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్ ఆధారంగా అజిత్ పవార్ ఆస్తులు.. అప్పుల లెక్కలు వెలుగులోకి వచ్చాయి. 12వ తరగతి వరకు చదువుకున్న అజిత్ పవార్ నికర ఆస్తుల విలువ దాదాపు రూ.124 కోట్లు. అయితే ఆయన అప్పులు రూ.21.39 కోట్లుగా ప్రకటించారు.
ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌ మేరకు అజిత్ పవార్ కుటుంబం వద్ద మొత్తం రూ. 14.12 లక్షల నగదు ఉండగా, వివిధ బ్యాంకు ఖాతాల్లో రూ. 6.81 కోట్లకు పైగా డిపాజిట్లు ఉన్నాయి. అజిత్ పవార్ బ్యాంకు డిపాజిట్లు మాత్రమే దాదాపు రూ. 3 కోట్లు. అతని భార్య సునేత్రా పవార్ ఖాతాల్లో కూడా ఇలాంటి మొత్తం ఉంది. దీనితో పాటు అతను NSS, పోస్టల్ సేవింగ్స్ ఖాతాలలో రూ. 1.52 కోట్లు జమ చేశాడు.

అయితే.. అజిత్ పవార్ పేరు మీద ఎలాంటి భీమా పాలసీలు లేనట్లు తెలుస్తోంది. ఇక.. విమాన ప్రమాదంలో అజిత్ పవార్ ఆకస్మిక మరణం తో మొత్తం ఎన్సీపీ నేతలు విషాదంలో ఉన్నారు. ఆయనతో పాటుగా మరో అయిదుగురు ఈ ప్రమాదం లో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన పైన విమానయాన శాఖ విచారణ ప్రారంభించింది.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications