రైతులు, యువత బీజేపిని సాగనంపేందుకు సిద్దంగా ఉన్నారు..! అఖిలేష్ సంచలన వ్యాఖ్యలు..!!

లక్నో/హైదరాబాద్ : బీజేపి ప్రభుత్వం పై అఖిలేష్ యాదవ్ మరో సారి మండి పడ్డారు. దేశంలోని యువతలో ఏ విధంగా చైతన్యం వచ్చిందో రైతుల్లో కూడా అదే విధంగా చైతన్యం వచ్చిందని పేర్కొన్నారు. సార్వత్రిక సమరం ముగింపు దశకు చేరుకోవడంతో నేతలు సుడిగాలి పర్యటనలతో ప్రచారం హోరెత్తిస్తున్నారు. యూపీలోని పూర్వాంచల్‌లో ఆజంగఢ్‌, గోరఖ్‌పూర్‌, వారణాసి వంటి పలు కీలక నియోజకవర్గాల్లో ఆరో విడత పోలింగ్‌ జరగనుండటంతో ఆయా నియోజకవర్గాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆజంగఢ్‌లో ఎస్పీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌ బరిలో నిలవగా బీజేపీ తరపున ప్రముఖ భోజ్‌పురి నటుడు దినేష్‌ లాల్‌ యాదవ్‌ తలపడుతున్నారు.

Akhilesh Yadav Claims Farmers And Youth Will Vote Against BJP

పూర్వాంచల్‌ ప్రాంతంలో గతంలో తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు తమ పార్టీకి కలిసివస్తాయని అఖిలేష్‌ యాదవ్‌ ధీమా వ్యక్తం చేశారు. యువత, రైతులు పెద్దసంఖ్యలో ఎస్పీ వెంట నడుస్తున్నారని చెప్పకొచ్చారు. తమ ప్రభుత్వం ముందుకు తెచ్చిన పూర్వాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టును గత రెండేళ్లుగా యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్‌ జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. దేశ యువత, రైతాంగం తమను మోసగించిన మోదీ సర్కార్‌ను సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+