అది బీజేపీ వ్యాక్సిన్- నేను వేయించుకోను- అఖిలేష్ యాదవ్ సంచలనం
కరోనా వ్యాక్సిన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారు. ప్రజలకు సాధ్యమైనంత త్వరగా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకురావాలని భారత్‌లో తయారీ సంస్ధలు, కేంద్ర ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో కరోనా వ్యాక్సిన్‌ను బీజేపీకి ఆపాదిస్తూ యూపీ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
భారత్‌లో కరోనాపై పనిచేసేందుకు కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెస్తున్న వ్యాక్సిన్‌ను తాను నమ్మబోనని యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి తెరలేపాయి. బీజేపీ ప్రభుత్వం ఇస్తున్న ఈ వ్యాక్సిన్ నమ్మదగిందిగా లేదన్నారు. తాను వ్యాక్సిన్ వేయించుకోబోనంటూ అఖిలేష్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. తాను బీజేపీ నేతలను నమ్మబోనని, తాము అధికారంలోకి వస్తే ఉచిత వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెస్తామని అఖిలేష్ తెలిపారు.

ఆక్స్‌ఫర్డ్ టీకాను భారత్‌లో సరఫరా చేసేందుకు డ్రగ్ కంట్రోలర్ ఆమోదం తెలిపిన కొద్ది గంటల్లోనే అఖిలేష్ యాదవ్ చేసిన ప్రకటన వివాదం రేపుతోంది. అదీ ఇవాళ దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ డ్రై రన్ జరుగుతున్న సమయంలోనే ఈ ప్రకటనతో రాజకీయ వివాదం రేపారు. కేంద్రంలో బీజేపీ సర్కారు కరోనా వైరస్ గురించి మాత్రమే ఆలోచిస్తుందని, కానీ విపక్ష పార్టీలు వ్యాక్సిన్‌పై చేతల్లో చూపిస్తాయని అఖిలేష్ వ్యాఖ్యానించారు. కరోనా నుంచి బయటపడేందుకు చప్పట్లు కొట్టాలని, ప్లేట్లు మోగించాలని ఇప్పటికే పలుమార్లు బీజేపీ సర్కారు మోసం చేసిందన్నారు.
అఖిలేష్ వ్యాఖ్యలపై యూపీ బీజేపీ నేతలు మండిపడుతున్నారు. వ్యాక్సిన్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్న శాస్త్రవ్తేతలను అఖిలేష్ వ్యాఖ్యలు నిరుత్సాహ పరిచేలా ఉన్నాయని యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య విమర్శించారు. శాస్త్రవేత్తలకు అఖిలేష్ వెంటనే క్షమాపణలు చెప్పాలన్నారు. అఖిలేష్ వ్యాక్సిన్‌ను నమ్మకపోతే ఆయన్ను యూపీ ప్రజలు నమ్మబోరన్ మౌర్య కౌంటర్ ఇచ్చారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications