అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్.. బంపర్ ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు.. హర్రీ అప్!
వినాయక చవితి ముగిసింది. ఇక దసరా, దీపావళి పండుగల సీజన్ వచ్చేసింది. బోలెడన్ని అద్భుతమైన ఆఫర్లతో ఈ కామర్స్ దిగ్గజ సంస్థలు తమ వినియోగదారులకు ఫెస్టివల్ సేల్ అందించడానికి రెడీ అయ్యాయి. ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్ త్వరలో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కు రెడీ అయ్యింది. అమెజాన్ కస్టమర్లకు శుభవార్త చెప్పింది.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ తేదీలు సెప్టెంబర్ నెలలోనే ప్రారంభం కానున్నాయని amazon వెల్లడించింది. అమెజాన్ ప్రైమ్ సభ్యుల కోసం సెప్టెంబర్ 26వ తేదీ అర్దరాత్రి నుండి ఈ సేల్ ప్రారంభం అవుతుందని, సెప్టెంబర్ 27 నుండి అందరికీ ఈ సేల్ అందుబాటులో ఉంటుందని ఈ మేరకు అమెజాన్ ధ్రువీకరణ చేసింది. అయితే ఎప్పటి మాదిరిగానే ఈ సేల్ ఎప్పుడు ముగుస్తుంది అనేది మాత్రం అమెజాన్ వెల్లడించలేదు.

దీపావళి వరకు అమెజాన్ ఫెస్టివల్ సేల్
ఈ ఫెస్టివల్ సేల్ దీపావళి వరకు కొనసాగుతుందన్న ఆశాభావం అందరిలో వ్యక్తమవుతుంది. అమెజాన్ ఫెస్టివల్ సేల్ లో పాల్గొనేవారు అద్భుతమైన బ్యాంక్ ఆఫర్లను క్యాష్ బ్యాక్ డీల్స్ ను కూడా పొందవచ్చని అమెజాన్ పేర్కొంది. సేల్ సమయంలో ఎస్బిఐ క్రెడిట్, డెబిట్ కార్డులను ఉపయోగించి పది శాతం ఇన్స్టెంట్ డిస్కౌంట్ పొందవచ్చని, ఎలాంటి గరిష్ట లిమిట్ లేకుండా వెల్కమ్ ఆఫర్ కింద 20% వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చని పేర్కొంది.
గృహోపకరణాలపై భారీ డిస్కౌంట్లు
ఎలక్ట్రానిక్ గృహోపకరణాలైన వాషింగ్ మిషన్లు, ఎయిర్ కండిషనర్లు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు లేదా మరేదైనా గృహోపకరణాలను కొనుగోలు చేయాలనుకునే వారు 65% వరకు డిస్కౌంట్ పొందే అవకాశం ఉందని అమెజాన్ పేర్కొంది. ఎల్జి, శాంసంగ్ వంటి ప్రముఖ బ్రాండ్ల పైన గరిష్టంగా 65% వరకు డిస్కౌంట్ ఉన్నట్టు సమాచారం . ఎల్జి, వోల్టాస్, శామ్సంగ్ తదితర ఏసీల పైన 55% వరకు తగ్గింపు ఉందని సమాచారం.
ఫ్రిజ్ లు, వాషింగ్ మెషీన్లు, ఓవెన్ లపైన భారీగానే
ఎల్జి, శాంసంగ్, వర్ల్ పూల్ వంటి బ్రాండ్ల రిఫ్రిజిరేటర్ల పైన 55% వరకు తగ్గింపు ఉన్నట్టు సమాచారం. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో ఎల్జీ, శాంసంగ్, వర్ల్ పూల్ వంటి అగ్ర బ్రాండలకు చెందిన వాషింగ్ మెషిన్ ల పైన 55% వరకు తగ్గింపు ఉందని అలాగే మైక్రోవేవ్ ఓవెన్ ల పైన కూడా 55% వరకు తగ్గింపు ఉందని సమాచారం..
మొబైల్స్, ఫోన్ యాక్ససరీస్ పైనా బోలెడు ఆఫర్లు
ఇక మొబైల్ ఫోన్స్, ఫోన్ యాక్సిస్సోరీస్ పైన కూడా ఊహించని విధంగా భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ఐఫోన్ 13 39వేల తొమ్మిది వందల తొంబై తొమ్మిది రూపాయలకు లభిస్తుందని, దీని ఎమ్మార్పీ నుంచి పదివేల రూపాయల తగ్గింపు వస్తుందని, బ్యాంక్ ఆఫర్ల ద్వారా అదనంగా 2500 తగ్గింపు ఉంటుందని సమాచారం. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2024 గురించి మరిన్ని వివరాల కోసం మీరు Amazon.inని విజిట్ చెయ్యండి.












Click it and Unblock the Notifications