నెహ్రూ తప్పులతోనే పీవోకే దూరం-అమిత్ షా విసుర్లు-లోక్ సభలో 2 జమ్మూకశ్మీర్ బిల్లుల ఆమోదం

పార్లమెంట్ శీతాకాల సమావేశాల మూడో రోజు లోక్ సభ జమ్ము కశ్మీర్ కు సంబంధించిన రెండు కీలక బిల్లుల్ని ఆమోదించింది.లోక్‌సభ ఆమోదించిన బిల్లుల్లో జమ్మూ కాశ్మీర్ రిజర్వేషన్ (సవరణ) బిల్లు, 2023, అలాగే జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు, 2023 ఉన్నాయి. అయితే ఈ బిల్లులపై చర్చ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో ప్రతిపక్ష సభ్యులు వాకౌట్ చేశారు.

భారత తొలి ప్రధాని నెహ్రూ చేసిన రెండు పొరపాట్ల వల్ల జమ్మూ కాశ్మీర్ నష్టపోయిందని అమిత్ షా జమ్ముకశ్మీర్ బిల్లులపై చర్చలో వ్యాఖ్యానించారు. మొదట కాల్పుల విరమణ ప్రకటించి, ఆపై కాశ్మీర్ సమస్యను ఐక్యరాజ్యసమితికి తీసుకెళ్లడం ద్వారా నెహ్రూ తప్పులు చేశారన్నారు. జవహర్‌లాల్ నెహ్రూ సరైన చర్యలు తీసుకుంటే, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఇప్పుడు భారతదేశంలో భాగమై ఉండేదని, ఇది చారిత్రాత్మక తప్పిదమని అమిత్ షా విమర్శించారు. దీనిపై విపక్షాలు మండిపడ్డాయి. అనంతరం రెండు బిల్లులు ఆమోదం పొందగానే విపక్షాలు వాకౌట్ చేశాయి.

amit shah blames nehru for his historic blunders on kashmir, ls passed 2 j&k bills, oppn walks out

మరోవైపు లోక్‌సభలో ప్రతిపక్ష సభ్యులు నిన్న జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించడానికి ప్రభుత్వం గడువు చెప్పాలని కోరారు. అయితే ఇందుకు కేంద్రం సిద్ధంగా ఉందని, నిర్ణయం తీసుకోవాల్సింది ఎన్నికల సంఘమేనని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. వాస్తవానికి ఈ కేంద్రపాలిత ప్రాంతం 2018 నుంచి కేంద్ర పాలనలో ఉంది. ఈ చర్చలో హోంమంత్రి అమిత్ షా జోక్యం చేసుకుంటూ దేశానికి ఒకే జెండా, ఒకే రాజ్యాంగం ఉండేలా మోదీ ప్రభుత్వం హామీ ఇచ్చిందని అన్నారు. రెండు బిల్లులను జులై 26న లోక్ సభలో ప్రవేశపెట్టి ఆమోదించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+