యోగా డే: అమిత్ షాకు ముస్లిం టీచర్ చిట్కాలు
పాట్నా: జూన్ 21ని ''అంతర్జాతీయ యోగా డే'గా దేశ వ్యాప్తంగా నిర్వహించనున్న సంగతి తెలిసిందే. యోగా డేని పురస్కరించుకుని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆరోజున ఓ ముస్లిం ఉపాధ్యాయుడి నుంచి యోగా పాఠాలు నేర్చుకోనున్నారు.
'యోగా నిపుణులు మహ్ద్ తమన్నా, అశోక్ సర్కార్‌లు అమిత్ షాకు పాట్నాలోని మొనుల్ హక్ స్డేడియంలో యోగా ఆసనాల గురించి వివరిస్తారు' అని బీహార్-జార్ఖండ్ పతంజలి యోగాపీఠం ఇన్‌ఛార్జ్ అజిత్ కుమార్ తెలిపారు.
అంతేకాదు యోగాకు సంబంధించిన కొన్ని చిట్కాలను కూడా అమిత్ షాకు తమన్నా తెలిపనున్నారని తెలిపారు. పాట్నాలో నిర్వహించే ఈ యోగా క్యాంప్‌లో కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, రాజీవ్ ప్రతాప్ రూఢీ, రాధా మోహన్ సింగ్, రామ్ క్రిపాల్ యాదవ్‌లు పాల్గొంటారని తెలుస్తోంది.

అమిత్ షా బీహార్ రాజధాని పాట్నాలో యోగా డేలో పాల్గొనడం రాజకీయంగా పెద్ద చర్చనీయాంశమైంది. ఈ ఏడాదిలో బీహార్ ఎన్నికలు జరుగుతుండమే ఇందుకు నిదర్శనం. ఇటీవల ఓ కార్యక్రమంలో యోగే చేసేందుకు సరిపోయే శరీరామా నీది అంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నుద్దేశించి బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వ్యంగంగా వ్యాఖ్యానించాడు.
అంతేకాదు, ప్రతిరోజూ ఇంట్లో యోగా చేస్తూ ఆరోగ్యంగా ఉండాలని సలహా ఇచ్చారు. బీజేపీ మాత్రం యోగాను ఒక పబ్లిక్ స్టంట్ లా చేస్తోందని విమర్శించారు. ఈ ఏడాది బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేఫథ్యంలో బీజేపీ ఈ యోగా డేని రాజకీయంగా వాడుకుంటుందని నితీశ్ కుమార్ అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications