అవార్డులు: అమితాబ్, అద్వానీకి పద్మభూషణ్, పివి. సింధుకి పద్మశ్రీ
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం గణతంత్ర దినోత్సవ సందర్భంగా శుక్రవారం ప్రతిష్టాత్మకమైన పద్మ అవార్డులను ప్రకటించినట్లు టీవిలో వార్తలు హల్ చల్ చేశాయి. టీవిలో వచ్చిన వార్తల ప్రకారం... వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన 148 మందికి ఈ అవార్డులు ప్రకటించనుందని సమాచారం. గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ అవార్డులను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రధానం చేయనున్నారు.
బీజేపీ కురువృద్ధుడు, సీనియర్ లీడర్ ఎల్‌కే అద్వానీ, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, యోగా గురువు రాందేవ్ బాబాలతో పాటు పండిట్ రవిశంకర్ గురూజీలకు పద్మవిభూషణ్ అవార్డుల లిస్ట్‌లోఉన్నట్లు సమాచారం. బాలీవుడ్ నటుడు దిలీప్‌కుమార్‌తో పాటు మాజీ ఎన్నికల కమిషనర్ ఎన్.గోపాలస్వామిలకు పద్మభూషణ్ పురస్కారాలు లభించనున్నాయి.

ఇక తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, హైదరాబాద్ బ్యాడ్మింటన్ స్టార్ పివి. సింధులకు పద్మశ్రీ అవార్డుల లిస్ట్‌లో ఉన్నారంట. ప్రఖ్యాక దర్శకనిర్మాత సంజయ్ లీలా భన్సాలీ, గీత రచయిత సలీం ఖాన్, యాడ్ ఫిలిం మేకర్ ప్రసూన్ జోషి కూడా ఈ ఏడాది పద్మ అవార్డులను అందుకోనున్న జాబితాలో ఉన్నట్లు సమాచారం. ఈ నెల 25న జరిగే ప్రత్యేక కార్యక్రమంలో వీరికి పద్మ అవార్డులు ప్రదానం చేయనున్నారు.
పద్మభూషణ్ అవార్డు:
ఎల్‌కే అద్వానీ, అమితాబ్ బచ్చన్, రాందేవ్ బాబా, రవిశంకర్ గురూజీ
పద్మ భూషణ్ అవార్డు
దిలిప్ కుమార్, ఎస్ గోపాల స్మామి
పద్మశ్రీ
రజనీ కాంత్, పివి. సింధు, సర్ధార్ సింగ్, ప్రకాశ్ సింగ్ బాదల్
పద్మ అవార్డులు
ప్రకాశ్ సింగ్ బాదల్, రజనీకాంత్
పద్మ అవార్డుల వివాదాల్లోకి వెళ్లదలచు కోలేదు: నారంగ్
పద్మ అవార్డుల విషయంలో అనవసరంగా వివాదాల్లోకి తాను వెళ్లాలను కోవడం లేదని భారత షూటర్ గగన్ నారంగ్ పేర్కొన్నారు. అవార్డులు వచ్చినప్పుడే వస్తాయని, ఇలాంటి విషయాల్లో ప్రభుత్వ నిర్ణయాలనే తాను స్వాగతిస్తానని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications