వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమితాబ్ బచ్చన్: నేపాల్ భూకంప బాధితులకు చేతనైనంత సాయం చేద్దాం..!

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

ముంబై: వరుస భూప్రకంపనలతో అతలాకుతలమైన నేపాల్‌ భూకంప బాధితులకు సాయం అందించేందుకు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ముందుకొచ్చారు. భూకంప బాధితుల కోసం తన వంతుగా సాయం చేస్తానంటున్నారు. అంతే కాదు దేశంలో ప్రతి ఒక్కరూ తమవంతుగా సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. గత వారం నేపాల్‌లో సంభవించిన భూకంపంతో నేపాల్‌లోని పురాతన భవనాలు, భవంతులు నేలమట్టమైన సంగతి తెలిసిందే.

ఈ భూకంప వల్ల నేపాల్‌లో ఎంతో మంది నిరాశ్రయులవ్వగా, దాదాపు 5వేలకు పైగా మరణించినట్లు ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. బీగ్ బీ బుధవారం ట్విట్టర్‌లో 'భూకంప బాధితులు కుదురుకుని, విశ్రాంతి తీసుకున్నాక త్వరలోనే మన అన్నదమ్ములు, సోదరీమణులకు మన వంతు సాహాయం తప్పకుండా చేయాలి. సమయం గడచిపోతుంది. కానీ, ఆలోచనలు, ప్రార్ధనలు మాత్రమే నేపాల్, భారత్ భూకంప బాధితుల్లో మిగిలి ఉంటాయి' అని ట్వీట్ చేశారు.

Amitabh Bachchan: Must do whatever we can to help Nepal victims

భూకంప వినాశకర వీడియోలు చూస్తుంటే ఎంతో భయంకరంగా ఉన్నాయని, ప్రకృతి క్రూరత్వాన్ని తన క్రూరత్వాన్ని మాటల్లో చెప్పలేని విధంగా నేపాల్ ప్రజలపై చూపించిందన్నారు. గత శనివారం నేపాల్‌లో రేక్టర్ స్కేలుపై 7.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపానికి గాను నేపాల్ రాజధాని కాఠ్మండు పూర్తిగా ధ్వంసమైంది. ఈ భూకంప ప్రభావం 80 లక్షల మందికి పైగా పడిందని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది.

English summary
Megastar Amitabh Bachchan seems to have lost faith in the saying – ‘Life goes on’ – after the Nepal tragedy. He says he can’t get his heart to agree with it, adding that all steps must be taken to get the nation back on its feet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X