అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్ కేసు: సుప్రీంకోర్టులో పిటిషన్ ఉపసంహరించుకున్న ఏపీ ప్రభుత్వం - Newsreel

అమరావతి భూకుంభకోణం

అమరావతి భూముల విషయంలో సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.

ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణలతో చేపట్టిన దర్యాప్తు నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.

ఈ కేసులో మూడు రోజుల క్రితమే ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.

దీంతో మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ కేసులోనూ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రభుత్వం తరపున న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. ఏపీ రాజధాని నిర్మాణం కోసం చేసిన భూసేకరణలో అవినీతి జరిగిందంటూ నమోదైన ఎఫ్ఐఆర్‌లో 12 మందిని నిందితులుగా పేర్కొన్నారు.

వీరిలో మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ సహా పలువురున్నారు.

వైఎస్ జగన్ విపక్షంలో ఉన్నప్పుడు అమరావతి భూముల ల్యాండ్ ఫూలింగ్ సహా పలు విధానాలను ప్రశ్నించారు.

జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ల్యాండ్ పూలింగ్‌పై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించారు.

రాజధాని ఏర్పాటుకి సంబంధించి ముందే సమాచారం తెలుసుకున్న కొందరు, అమరావతి ప్రాంతంలో చౌకగా భూములు కొనుగోలు చేశారన్నది ప్రధాన అభియోగం.

దీనిపై సిట్ దర్యాప్తులో భాగంగా నమోదైన ఎఫ్ఐఆర్ విషయం వివాదాస్పదమయ్యింది.

సుప్రీంకోర్టు

ఈ కేసు చెల్లదంటూ మాజీ ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ సహా పలువురు ఏపీ హైకోర్టులో పిటీషన్ వేశారు.

వాటిని విచారించిన హైకోర్టు ఈ కేసులో విచారణ నిలుపుదల చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. అంతేగాకుండా ఈకేసుకి సంబంధించిన అంశాలను సోషల్ మీడియా సహా ఎక్కడా ప్రస్తావించకూడదని ఆదేశాలు కూడా ఇచ్చింది.

గత ఏడాది సెప్టెంబర్‌లో ఏపీ హైకోర్టు జారీ చేసిన గ్యాగ్ ఉత్తర్వులపై పెద్ద దుమారమే రేగింది.

అప్పట్లో ఏపీ సీఎం నేరుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పలు ఆరోపణలతో కూడిన లేఖలు రాశారు.ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో అప్పీల్ చేసిన ఏపీ ప్రభుత్వం, తన పిటిషన్‌ని ఉపసంహరించుకోవడం ఆసక్తిగా మారింది.

ఏపీ ప్రభుత్వం తరపున అడ్వకేట్ మఫూజ్ నజ్కీ వాదనలు వినిపించారు. ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్న నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని కోర్టుకి తెలిపారు.

ఈ కేసు విచారణను నాలుగు వారాల్లో పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సూచించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+