Mobile Blast: స్మార్ట్ ఫోన్ పేలి బాలిక మృతి.. స్పందించిన షావోమీ..
కార్టూన్లు చూస్తున్న మొబైల్ ఫోన్ పేలడంతో 8 ఏళ్ల బాలిక మృతి చెందిన ఘటన కేరళలోని త్రిసూర్ జిల్లాలో జరిగింది. ఫోన్‌ను ఎక్కువసేపు వాడడం వల్లే బ్యాటరీ ఎక్కువగా వేడెక్కడం వల్ల పేలుడు సంభవించి ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. బాలిక చేతిలోని మొబైల్ ఫోన్ పేలడంతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పేలుడుకు గల ఖచ్చితమైన కారణాన్ని పోలీసులు ఇంకా నిర్ధారించలేదని ఫోన్ ఫోరెన్సిక్ పరీక్ష తర్వాత ఏ జరిగిందో తెలుస్తుందని చెప్పారు
"పేలుడు ప్రభావం తీవ్రంగా ఉంది. ఆమె కుడి అరచేతి, ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. ఇరుగుపొరుగువారు కూడా ధ్వని చాలా ఎక్కువగా ఉందని చెప్పారు"అని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. మొబైల్ ఫోన్ బ్యాటరీలు చిన్నపాటి పేలుడు సంభవించినట్లు గతంలో కూడా నివేదించామని, అయితే ఇది అరుదైన సంఘటన అని ఆయన అన్నారు. మృతి చెందిన బాలిక మాజీ బ్లాక్ పంచాయతీ సభ్యుని కుమార్తెగా గుర్తించారు.

ఘటన జరిగినప్పుడు బాలికతో పాటు అమ్మమ్మ ఇంట్లోనే ఉన్నారు. బాలిక తరచుగా కార్టూన్లు చూసేదని, పాఠశాల సెలవులు మరింత ఎక్కువ ఫోన్లు చూస్తున్నట్లు చెప్పారు. ఈ మొబైల్ ఫోన్‌ను మూడేళ్ల క్రితం కొనుగోలు చేశారని, మూడు నెలల క్రితం బ్యాటరీని మార్చారని బాలిక తండ్రి చెప్పారు. ఈ ఘటనపై రెడ్ మీ మొబైల్స్ మాతృ సంస్థ షావోమీ ఇండియా ప్రతినిధులు స్పందించారు. వినియోగదారుల భద్రత తమకు అత్యంత ప్రాధాన్య అంశమని చెప్పారు.
ఈ కఠిన పరిస్థితుల్లో బాధిత కుటుంబానికి సాధ్యమైనంత మేర అండగా ఉంటామని చెప్పారు. కొన్ని రిపోర్టులు రెడ్ మీ మొబైల్ పేలిందని చెప్తున్నాయి. అదింకా నిర్ధారణ కాలేదని, అధికారులకు సహకరించి నిజానిజాలు నిగ్గులేందుకు కృషి చేస్తామన్నారు. మొబైల్ ఫోన్లు పేలడం ఇదే తొలిసారి కాదు. కొన్ని నెలల క్రితం తన మొబైల్‌కు చార్జింగ్ పెడుతుండగా షాక్ కొట్టి ఒక యువకుడు చనిపోయాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!!












Click it and Unblock the Notifications