అనంత్ అంబానీ వెడ్డింగ్ కార్డ్.. వెండి ఆలయం, బంగారు విగ్రహాలతో.. అవాక్కయ్యే ధర!!

ఆసియా ఖండంలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ల వివాహానికి సమయం దగ్గర పడుతుంది. ఇక పెళ్లిపనులలో అంబానీ ఫ్యామిలీ బిజీ అయింది. జులై 12వతేదీన ముంబైలో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ల వివాహం అంగరంగ వైభవంగా జరపడానికి నిర్ణయించిన అంబానీ ఫ్యామిలీ అనంత్ అంబానీ పెళ్లిలో ప్రతిదీ ప్రత్యేకంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.

అనంత్ అంబానీ రాధికా మర్చంట్ ల వెడ్డింగ్ కార్డు
అందులో భాగంగా ప్రస్తుతం పెళ్లికి ఆహ్వానించడానికి తయారు చేసిన వెడ్డింగ్ కార్డ్ లో తమ ప్రత్యేకతను చాటారు. ఇటీవల పెళ్లి కార్డును తయారు చేయించిన అంబానీ ఫ్యామిలీ ఈ వెడ్డింగ్ కార్డును కాశీ విశ్వేశ్వరుని పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. ఈ వెడ్డింగ్ కార్డును ఇప్పటికే సన్నిహితులు, సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులకు పంపిస్తూ పెళ్ళికి ఆహ్వానిస్తున్నారు.

Anant Ambani- Radhika marchant Wedding Card Silver Temple with Gold Idols Surprising Price

అనంత్ అంబానీ వెడ్డింగ్ కార్డ్ ధర తెలిస్తే షాక్ పక్కా
ప్రస్తుతం అనంత్ అంబానీ రాధిక మర్చంట్ల వివాహ పెళ్లి పత్రికలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఇక ఈ వెడ్డింగ్ కార్డు ధర తెలిసే ప్రతి ఒక్కరు కచ్చితంగా నోరెళ్లబెట్టాల్సిందే.. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ల వివాహం కోసం అంబానీ ఫ్యామిలీ పంచుతున్న వెడ్డింగ్ కార్డు ధర అక్షరాల 6 లక్షల 50వేల రూపాయలు. మూడు కేజీల వెండి దేవాలయంలో, 24క్యారెట్ల బంగారు విగ్రహాలతో కూడిన వెడ్డింగ్ కార్డును వారు పంచుతున్నారు.

వెండి, బంగారంతో వెడ్డింగ్ కార్డు
గతంలో కూడా అంబానీ తన కూతురు ఇషా అంబానీ పెళ్లికి మూడు లక్షల విలువ చేసే వెడ్డింగ్ కార్డును పంచి అందరితో ఔరా అనిపించారు. ఇప్పుడు మళ్లీ అత్యంత కాస్ట్లీ గా అనంత్ అంబానీ వెడ్డింగ్ కార్డులను పంచుతున్నారు. ఇప్పటికే ఈ వెడ్డింగ్ కార్డును కొంతమంది ముఖ్యమంత్రులకు, ఇతర వివిఐపీలకు అందించారు. ఇక ఈ వెడ్డింగ్ కార్డులో వెండితో చేసిన చిన్న గుడి అందులో ఒక బంగారు విగ్రహం కనిపిస్తున్నాయి.

పెళ్లి కార్డు ఇలా
పెళ్లి కార్డు కు సంబంధించిన బాక్స్ తెరవగానే బ్యాగ్రౌండ్ లో విష్ణు సహస్రనామం వినిపిస్తుంది. ఆలయంలో కాకుండా ఇతర బాక్సుల్లోనే బంగారంతో చేసిన దేవుళ్ళ విగ్రహాలు ఉన్నాయి. ఇక పెళ్లి కార్డులో వినాయకుడు, లక్ష్మీదేవి, శ్రీమహావిష్ణువు, రాధాకృష్ణ, దుర్గాదేవి వంటి దేవుళ్ళ చిత్రాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే బాక్సులో ఉన్న మరో వెండి పెట్టెలో ఓం అని ఎంబ్రాయిడరీ చేసిన శాలువా, బంగారంతో చేసిన వివిధ దేవుళ్ళ విగ్రహాలు ఉన్నాయి.

సోషల్ మీడియాలో వెడ్డింగ్ కార్డు వైరల్
అత్యంత ప్రత్యేకంగా తయారు చేయించిన ఈ వెడ్డింగ్ కార్డు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ వెడ్డింగ్ కార్డ్ ని చూసిన వారంతా అపర కుబేరుడు ఈ మాత్రం ఖర్చు పెడతాడని ఎక్స్పెక్ట్ చేసిందే అంటూ చెబుతున్నారు. ఏది ఏమైనా పెళ్లి కార్డుకే ఇంత ఖర్చు పెడితే పెళ్ళికి మరెంత ఖర్చు పెట్టనున్నారో అని చర్చిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+