విజయ్ ను గెలిపిస్తున్న అన్నామలై?.. లోగుట్టు బయటపెట్టిన సర్వే

ద్రవిడ రాజకీయాల కోటలో ఇప్పుడు ఒక కొత్త యుద్ధం మొదలైంది. ఒకవైపు అధికార డీఎంకే తన పట్టు నిలుపుకోవాలని చూస్తుంటే, మరోవైపు ప్రతిపక్షాల మధ్య సమన్వయం లేకపోవడం సంచలనంగా మారింది. ముఖ్యంగా తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై అనుసరిస్తున్న ఒంటరి పోరాట శైలి, అన్నాడీఎంకే ఓటు బ్యాంకును దెబ్బతీస్తూ.. పరోక్షంగా దళపతి విజయ్ రాజకీయ భవిష్యత్తుకు బాటలు వేస్తోందా? అన్న చర్చ జోరుగా సాగుతోంది.

అన్నామలై వ్యూహం: పార్టీ కోసమా? తన కోసమా?

అన్నామలై తనను తాను కేవలం ఒక పార్టీ అధ్యక్షుడిలా కాకుండా, ఒక పవర్‌ఫుల్ 'వ్యవస్థ'లా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారనే విమర్శలు సొంత పార్టీలోనే చాలా కాలం నుంచి వినిపిస్తుంది. బీజేపీ క్యాడర్‌ను పార్టీ కోసం కాకుండా, తన వ్యక్తిగత ఇమేజ్ కోసం సెట్ చేసుకున్నారనే టాక్ బలంగా ఉంది. దీనివల్ల పొత్తులో భాగంగా అన్నాడీఎంకే పోటీ చేస్తున్న చోట మద్దతు ఇవ్వడానికి బీజేపీ క్యాడర్ ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. ఈ అంతర్గత విభేదాల వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు భారీగా చీలిపోయే ప్రమాదం కనిపిస్తోంది. అన్నా మలై కి సొంతంగా 234నియోజకవర్గాల్లో సొంతంగా ఓటు బ్యాంక్ ఉంది. సుమారు 4 నుంచి 9% వరుకు బలమైన ఓట్ బ్యాంక్ ఉండగా.. వీరిలో ఎక్కు మంది యూత్ ఉండటం హైలెట్.

Annamalai s Strategic Moves Hurting AIADMK How BJP s Internal Rift is Indirectly Benefiting Actor Vijay

టికెట్ కేటాయింపు వెనుక 'లోగుట్టు'!

ఈ ఎన్నికల్లో అన్నామలై ఎందుకు పోటీ చేయడం లేదనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన గుసగుసలు వినిపిస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. క్షేత్రస్థాయిలో బీజేపీకి ఆశించిన స్థాయిలో మద్దతు లేదని, డిపాజిట్లు రావడం కూడా కష్టమేనని గ్రహించిన అన్నామలై, ముందే జాగ్రత్త పడి పోటీకి దూరంగా ఉన్నారనే చర్చ సాగుతోంది. ఓటమి భారంతో తన వ్యక్తిగత ఇమేజ్ దెబ్బతినకూడదనే ఉద్దేశంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తనకు బీజేపీ టికెట్ కేటాయించక పోవడాన్ని కూడా తనకు సింపతీ వచ్చేలా ఇప్పటికే మార్చుకున్నారనే టాక్ కూడా నడుస్తుంది. కరుడుగట్టిన బీజేపీ అభిమానులు సైతం.. కషాయం పార్టీలో కష్టపడిన వారికి స్థానం ఉండదేమో అనే భావన కలిగేలా అన్నా మలై చేస్తున్నా ప్రచారం ఉందని ఆ నోటా.. ఈ నోట చర్చ సాగుతుంది.

అన్నాడీఎంకేకు శాపంగా మారిన తీరు..

ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడమే కాకుండా.. అన్నాడీఎంకేను బలహీనపరచడమే అన్నామలై లక్ష్యంగా పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. అన్నాడీఎంకేను టార్గెట్ చేస్తూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఆ పార్టీకి శాపంగా మారాయి. దీనివల్ల అటు అధికార పక్షాన్ని గట్టిగా నిలదీసే అవకాశం కోల్పోయి, ప్రతిపక్షాల మధ్యే యుద్ధం నడుస్తోంది. ఈ పరిణామాలన్నీ డీఎంకేకు క్లీన్ స్వీప్ చేసే అవకాశాన్ని ఇస్తున్నాయని సర్వేలు విశ్లేషిస్తున్నాయి.

హంగ్ కు అవకాశం.. మారిన లెక్కలు

తమిళనాడులో ఎన్డీఏ కూటమి రెండుగా చీలిన తీరు తీవ్ర నష్టం కలిగిస్తుంది. మరోవైపు ఇదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును విజయ్ తనవైపు లాగుతున్నారు. ఇప్పటి వరకు డీఎంకే, అన్నా డీఎంకేకు అవకాశం కలిపించిన తమిళ ప్రజలు.. ఇప్పుడు మూడో ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారని, అది విజయ్ కు గొప్ప అవకాశం అని భావిస్తున్నారు. ఇది జరిగితే హంగ్ ఏర్పడే అవకాశం చాలా ఎక్కువగా ఉందని స్థానిక మీడియా స్పష్టం చేస్తుంది.

విజయ్‌కు కలిసొస్తున్న కాలం!

అన్నామలై వర్సెస్ అన్నాడీఎంకే పోరులో ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎటు వెళ్లాలో తెలియక అయోమయంలో ఉంది. ఈ శూన్యతను భర్తీ చేసేందుకు నటుడు విజయ్ స్థాపించిన 'తమిళగ వెట్రి కళగం' (TVK) సిద్ధంగా ఉంది. ద్రవిడ పార్టీల మీద అసంతృప్తిగా ఉన్న యువత, అన్నామలై తీరుతో విసిగిపోయిన ఓటర్లు ఇప్పుడు విజయ్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. పరోక్షంగా అన్నామలై సృష్టించిన ఈ రాజకీయ గందరగోళం విజయ్‌కు రాజకీయంగా పెద్ద మేలు చేస్తోందని సీప్యాక్ సర్వే సంస్థ తన అభిప్రాయాన్ని బయటపెట్టింది.

మొత్తం మీద తమిళనాడులో అన్నామలై వ్యవహార శైలి అన్నాడీఎంకే కొంప ముంచుతుంటే, విజయ్‌కు మాత్రం కొత్త ఆశలు చిగురింపజేస్తోంది. ఈ రాజకీయ చదరంగంలో అంతిమంగా డీఎంకే విజయం నల్లేరుపై నడకేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+