60 ఏళ్ల మహిళను రేప్ చేశాడని ఎంపీ మీద కేసు, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ ?, ప్రజ్వల్ దెబ్బకు !
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై మరో అత్యాచారం కేసు నమోదైంది. జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై రెండో అత్యాచారం కేసు నమోదు కావడం కలకలంరేపుతోంది. మే 2వ తేదీన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ పై మొదటిసారి అత్యాచారం కేసు నమోదైంది. అత్యాచారం వీడియోలు బయటకు రావడంతో ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఏప్రిల్ 27వ తేదీన జర్మనీకి పారిపోయారు.
అప్పటి నుంచి ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ పరారీలోనే ఉన్నాడు. ప్రజ్వల్ పై ఇంటర్‌పోల్ బ్లూ కార్నర్ నోటీసు కూడా జారీ అయ్యింది. అయితే ప్రజ్వల్ గురించి ఎలాంటి సమాచారం లేదని ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఎంపీ ప్రజ్వల్‌పై మరో అత్యాచారం కేసు కావడం హాట్ టాపిక్ అయ్యింది. హెచ్‌డీ రేవణ్ణ ఇంట్లో ఇంతకుముందు పని చేస్తున్న మహిళ దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా మే 5వ తేదీన కొత్త ఎఫ్‌ఐఆర్ నమోదైందని ఆలస్యంగా వెలుగు చూసింది.

ఏప్రిల్ 23వ తేదీ నుండి హాసన్‌లో వైరల్ అవుతున్న వీడియోలలో ఇప్పుడు అత్యాచారం ఫిర్యాదు చేసిన ఒక మహిళ వీడియో ఉంది. ప్రజ్వల్ కేసును సీబీఐకి అప్పగించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. 60 ఏళ్ల వయసున్న ఓ మహిళ తనను కాపాడాలంటూ చేతులు జోడించి ఏడుస్తూ వేడుకుంటున్నారని తెలిసింది. ప్రజ్వల్ తండ్రికి, తాతకి భోజనం చేసి వడ్డించిన తనను ఏమీ చెయ్యవద్దని ఆమె వేడుకుంటున్నా ప్రజ్వల్ ఆమెను వదల్లేదని, ఆ వీడియో చాలా భయానకమైనదని పోలీసు వర్గాలు తెలిపాయి.
అయితే ప్రజ్వల్ రేవణ్ణ ఆమె మాటలను పట్టించుకోకుండా అత్యాచారం చేస్తూ కనిపించాడు. వివిధ సెక్షన్ల కింద అత్యాచారం కేసు నమోదు చేశారు. 60 ఏళ్ల మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై అత్యాచారం ఆరోపణలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దేశం విడిచిపారిపోయిన జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ కేసు రోజురోజుకు మలుపులు తిరుగుతోంది.
ఓ కేసుకు సంబంధించి ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశారని ఆరోపణలు రావడంతో సిట్ అధికారులు హాసన్, బెంగళూరులోని పలు చోట్ల మహజర్ నిర్వహించారు. ఈ కేసులో ప్రజ్వల్ రేవణ్ణకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వకుండా ఉండేందుకు మాజీ మంత్రి రేవణ్ణ ఆదేశాల మేరకు బాధితురాలిని ఏప్రిల్ 29వ తేదీన కిడ్నాప్ చేశారని ఆరోపణలు ఉన్నాయి. మైసూర్ జిల్లాలోని హున్సూర్ తాలూకాలో ఆమెను కిడ్నాప్ చేశారని కేసు నమోదు కావడంతో హెచ్‌డీ రేవణ్ణ అరెస్టు చేశారు.

మే 4వ తేదీన సిట్ బృందం ఆమెను ఓ ఫామ్ హౌస్ లో రక్షించారు. మాజీ మంత్రి రేవణ్ణ కిడ్నాప్ కేసులో అరెస్ట్ కాగా ఆయన బెయిల్ పిటిషన్ మే 13వ తేదీన విచారణకు రానుంది. 2021లో హాసన్‌లోని తన అధికారిక నివాసంలో హాసన్ ఎంపీ ప్రజ్వల్ తనపై అత్యాచారం చేశాడని జేడీఎస్ పార్టీ కార్యకర్త చేసిన ఫిర్యాదు ఆధారంగా మే 2వ తేదీన ప్రజ్వల్ రేవణ్ణపై తొలిసారి అత్యాచారం కేసు నమోదైంది.
తనకు సహకరించకుంటే ఆమెను, ఆమె భర్తను చంపేస్తానని హాసన్ ఎంపీ ప్రజ్వల్ బెదిరించాడని ఆరోపణలు ఉన్నాయి. తనపై అత్యాచారం చేయడమే కాకుండా మొబైల్ ఫోన్‌లో రేప్ వీడియోలు చిత్రీకరించాడని, 2021 నుంచి 2024 ఏప్రిల్ వరకు తనపై అత్యాచారం చేసి పదే పదే బ్లాక్ మెయిల్ చేశాడని బాధితురాలు ఫిర్యాదులో ఆరోపించింది. 60 ఏళ్ల మహిళ కూడా జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అత్యాచారం చేశాడని కేసు నమోదు కావడంతో జేడీఎస్ పార్టీ కార్యకర్తలు హడలిపోతున్నారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications