మరో వివాదంలో తస్లీమా నస్రీన్, టివి సీరియల్ నిలిపివేత

తస్లీమాపై ముస్లిం మైనారీ సంఘాలు మండిపడుతున్నాయి. ఆమె రాసిన దుషోబస్ ఆధారంగా నిర్మించిన టివి సీరియల్ తమ మతవిశ్వాసాలను కించపరిచేలా ఉందని ఆరోపిస్తూ దాని ప్రసారాన్ని అడ్డుకున్నారు. వాస్తవానికి గురువారం రాత్రి 10 గంటలకు బెంగాలీ చానల్ ఆకాష్ ఆథ్‌లో ప్రసారం కావల్సి ఉండగా ముస్లిం సంస్థలు వత్తిడి చేసి నిలిపివేయించారు.
దుషాబస్ టెలీ సీరియల్ ప్రసారం అవుతుందని టివి నిర్వాహకులు ఎప్పటినుంచో ప్రచారం చేస్తూ వచ్చారు. ముస్లింల మత విశ్వాసాలను కించపరిచేలా తస్లీమా రచన ఉందని ఆరోపిస్తూ చానల్ వద్ద ఆందోళనకు దిగారు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో సీరియల్ ప్రసారం నిరవధికంగా వాయిదా వేసినట్టు నిర్వాహకులు వెల్లడించారు.
మహిళా సాధికారిత ఇతి వృత్తంతో తస్లీమా రచన చేశారని అందులో ఏ మతాన్ని అవమానించే సన్నివేశాలు, అంశాలు లేవని వారు వివరణ ఇచ్చారు. సమాజంలో వైషమ్యాలు సృష్టించేలా ఉన్న తస్లీమా సీరియల్‌ను ఆపేయాలని మిల్లీ ఇత్తేహద్ పరిషత్ నేత అబ్దుల్ అజీజ్ డిమాండ్ చేశారు.
పలు ముస్లిం మైనారిటీ సంస్థలు చానల్ ఆఫీసుకు వచ్చి ఆందోళనకు దిగాయి. సీరియల్‌కు సంబంధించి హోర్డింగ్స్ అలాగే తస్లీమా పేరును తొలగించాలని డిమాండ్ చేశాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ సీరియల్‌ను ప్రసారం చేయనీయబోమని కోల్‌కతాలోని టిప్పుసుల్తాన్ మసీదు షాహీ ఇమామ్ వౌలానా నురూర్ రహ్మాన్ బర్కతీ ప్రకటించారు.












Click it and Unblock the Notifications