వాట్సప్ లో మరో అదిరిపోయే కొత్త ఫీచర్; ఆఫ్ లైన్ లోనూ షేరింగ్.. ఇక రచ్చేనా!!
వాట్సప్ .. ప్రస్తుతం మన సమాజంలో ఇది లేకపోతే ఏ పని కావడం లేదు. ఉదయం నిద్ర లేచిన దగ్గర్నుంచి నిద్రపోయే దాకా, ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి, స్నేహితులతో సన్నిహితులతో టచ్లో ఉండడానికి, మన స్నేహితులకు, సన్నిహితులకు అవసరమైన ఫోటోలను, వీడియోలను పంపించడానికి ఈ యాప్ ఎంతో ఉపయోగపడుతుంది. మెటా ఆద్వర్యంలో ఉన్న ఈ యాప్ వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకువస్తుంది.
త్వరలో వాట్సప్ కొత్త ఫీచర్
ఇక తాజాగా whatsapp కొత్త ఫీచర్ ను తీసుకురాబోతుందని వార్తలు వస్తున్నాయి. ఈ ఫీచర్ ద్వారా ఇంటర్నెట్ లేకుండానే ఫోటోలు, ఫైల్స్, డాక్యుమెంట్లు, వీడియోలు ఆఫ్లైన్లో పంపించవచ్చు అని చెబుతున్నారు. సహజంగా మొబైల్ డేటా కానీ, wi-fi సౌకర్యం లేకపోతే మన మొబైల్లో ఉన్న ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు ఇతరులకు పంపించడానికి ఏ విధంగానూ వీలుకాదు.

ఇంటర్నెట్ లేకుండానే ఆఫ్ లైన్లో ఫోటోలు, వీడియోలు షేరింగ్
ఒక్కొక్కసారి ఇంటర్నెట్ సౌకర్యం లేనప్పుడు ఆఫ్లైన్లో ఏదైనా పంపించాలంటే సాధ్యపడని పరిస్థితులలో వినియోగదారులు ఒకింత అసహనానికి గురవుతున్నారు. అయితే వాట్సప్ తీసుకొస్తున్న సరికొత్త ఫీచర్ ద్వారా ఇంటర్నెట్ లేకుండానే ఫోటోలు, ఫైల్స్, వీడియోలు ఈజీగా షేర్ చేయవచ్చు. అయితే అది ఎక్కడ పడితే అక్కడ ఉన్నవారికి షేర్ చేయడం సాధ్యం కాదు. ఆఫ్లైన్లో ఫోటోలు షేర్ చేయాలంటే ఆ ఇద్దరు వ్యక్తులు పక్కపక్కనే ఉండాలి. వారి డివైజెస్ దగ్గరగా ఉండాలి.
ఆఫ్ లైన్ షేరింగ్ చెయ్యాలంటే ఇలా చెయ్యాలి
ఇందులో బ్లూటూత్ ఆప్షన్ ను ఆన్ చేసుకొని, ఫైల్ షేరింగ్ ఫీచర్ ను ఆన్ చేసుకొని, ఒక ఫోన్ నుంచి మరొక ఫోన్ కి కావలసిన ఫైల్ ను పంపించుకోవచ్చు. బ్లూటూత్ రీచ్ అయ్యేంత దగ్గరగా ఉంటేనే ఈ ఫెసిలిటీ ఉపయోగపడుతుంది. ఆఫ్లైన్ ఫైల్ షేరింగ్ కు సంబంధించి ఫీచర్ ను అవసరమైనప్పుడు ఆన్ చేసుకొని, తర్వాత ఆఫ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ షేర్ఇట్ మాదిరిగా పనిచేస్తుందని వాట్సప్ పేర్కొంది.
ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్ లో కొత్త ఫీచర్ .. త్వరలో అందుబాటులోకి
అయితే ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్లలో ఈ ఫీచర్ ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందన్న విషయం ఇంకా స్పష్టంగా తెలియదు. ప్రస్తుతానికి ఈ ఫీచర్ ను బీటా వెర్షన్ లో టెస్ట్ చేస్తున్నారు. ఇది సక్సెస్ అయితే త్వరలోనే అన్ని డివైజ్లకు అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications