Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏకంగా 222 టన్నుల పసిడితో మరో భారీ బంగారుగని.. అక్కడే!

భారతదేశంలో ఇటీవల బయటపడుతున్న కొత్త బంగారు గనులు దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపును తెస్తున్నాయి. భారతదేశంలో బంగారం వినియోగం ఎక్కువగా ఉండడంతో ప్రతి సంవత్సరం మనం అధిక భాగాన్ని ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నాం. అంతర్జాతీయ మార్కెట్ లో ప్రస్తుతం బంగారం ధరలు సామాన్య మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేసే స్థాయిలో లేవు.

బంగారం ఉత్పత్తిలో గేమ్ ఛేంజర్ గా భారత్
సహజంగా భారతీయులు బంగారం కొనుగోలు చేయటాన్ని ఎక్కువ ఇష్టపడతారు. దీంతో బంగారాన్ని కొనుగోలు చేసుకుంటున్నారు. ఇప్పటికే బయట దేశాల నుండి బంగారం కొనుగోలు చేయటం వల్ల గణనీయంగా విదేశీ మారకద్రవ్యాన్ని కోల్పోతున్న పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు దేశంలోనే కొత్తగా బంగారు గనులు వెలుగు చూడడంతో భారతదేశం కూడా బంగారం ఉత్పత్తిలో గేమ్ ఛేంజర్ కాబోతుంది.

Another gold mine discovered in India 222 tons of gold may procure

Take a Poll

దేశంలో ఈ రాష్ట్రాల్లో బంగారు గనులు
ఇప్పటికే మనదేశంలో రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో బంగారు గనులు ఉన్నాయని మైనింగ్ నిపుణులు తెలిపారు. రాజస్థాన్లోని బన్స్వార జిల్లాలోని భూకియా - జగ్ పురా, కంకరియా- గారా ప్రాంతాలలో రెండు బంగారు గనులు ఉన్నాయని ఇప్పటికే కనుగొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్రంలో జొన్నగిరి గని మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కోలార్ గనులు దేశీయ అవసరాలను తీర్చడంలో కీలకంగా మారుతున్నాయి.

రాజస్థాన్ రాష్ట్రంలో మరో భారీ బంగారు గని
రాజస్థాన్ రాష్ట్రంలోని ఒక్క బన్స్వార జిల్లాలోనే దేశంలోని 25 శాతం బంగారం డిమాండ్ తీర్చగలిగే బంగారం ఉత్పత్తి అవుతుందని చెబుతున్నారు. బన్స్వార జిల్లాలోని ఘటోల్ తెహసీల్ కంకారియా గ్రామం పరిధిలో మూడవ భారీ బంగారు నిల్వలు ఉన్నట్టు అధికారులు ధ్రువీకరించారు. ఇప్పటివరకు గుర్తించిన భూకియా, జగ్ పురా గనుల తర్వాత ఈ ప్రాంతం మూడవ బంగారు గనిగా నిలిచిందని చెప్తున్నారు.

222.39 టన్నుల స్వచ్ఛమైన బంగారం దొరికే ఛాన్స్
ఈ కొత్త గనిలో 940. 26 హెక్టార్ల విస్తీర్ణంలో సుమారు 113.52 మిలియన్ టన్నుల బంగారు ఖనిజం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు ఈ ఖనిజాన్ని వెలికి తీసి ప్రాసెస్ చేసిన తర్వాత 222.39 టన్నుల స్వచ్ఛమైన బంగారు లోహం లభించవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఈ బంగారు గనులతో స్థానికంగా ఉన్న ప్రజలకు ఉపాధి దొరకడమే కాకుండా, భారతదేశంలో కొంతమేర బంగారు కొరత తీరుతుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+