IPL 2023 : కోల్ కతా నైట్ రైడర్స్ కు మరో బ్యాడ్ న్యూస్- ఆ స్టార్ బ్యాట్స్ మెన్ కూడా దూరం..!
కోల్ కతా : కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ఐపీఎల్ 2023కు సిద్ధమవుతోంది. గతంలో పలుమార్లు ఐపీఎల్ లో సత్తా చాటుకున్న కోల్ కతా జట్టు ఈ సీజన్ లోనూ సత్తాచూపుతుందని అభిమానులు కూడా గంపెడాశలు పెట్టుకున్నారు. ఈ తరుణంలో జట్టుకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఐపీఎల్ తాజా సీజన్ ప్రారంభానికి ముందే ఈ ఎదురుదెబ్బలు తగులుతుండటంతో ఇక జట్టు పనైపోయిందన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి.
కోల్ కతా నైట్ రైడర్స్ జట్టులో ఇప్పటికే పలువురు ఆటగాళ్లు గాయాల పాలయ్యారు. వీరిలో కొందరు జట్టుకు ఐపీఎల్ సీజన్ కు ముందే దూరమయ్యారు. వీరిలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ప్రీమియం న్యూజిలాండ్ పేసర్ లాకీ ఫెర్గూసన్ గాయాల కారణంగా ఈ సీజన్ లో ఆడటం కష్టంగా మారింది.
ఇప్పుడు వీరి జాబితాలోకి స్టార్ బ్యాట్స్ మెన్ నితీష్ రాణా కూడా చేరిపోయాడు. తాజాగా గురువారం ఈడెన్ గార్డెన్స్‌లో ప్రాక్టీస్ సెషన్‌లో ఎడమ చీలమండ గాయంతో బాధపడ్డాడు. దీంతో ఈ సీజన్లో కేకేఆర్ జట్టులో మూడో కీలక ఆటగాడు గాయాలపాలైనట్లయింది.

ప్రాక్టీస్ సందర్భంగా త్రోడౌన్‌లను తీసుకోవడానికి వెళ్ళే ముందు నితీష్ రాణా ఇప్పటికే రెండు వేర్వేరు నెట్‌లలో బ్యాటింగ్ చేశాడు అలాగే కేకేఆర్ స్పిన్నర్లు, నెట్ బౌలర్‌లను కూడా ఎదుర్కొన్నాడు. ఆ సమయంలో ఓ బంతి అతని ఎడమ చీలమండపై ఫ్లష్‌గా తగిలింది.
దీంతో వెంటనే ప్రాక్టీస్ నుంచి రాణా తప్పుకున్నాడు. గాయం తర్వాత చికిత్స చేయించుకునే సమయంలోనూ రాణా విసుగ్గా కనిపించాడు. అయితే శిక్షణ పూర్తయ్యే వరకూ పిచ్ దగ్గర మాత్రం ఉన్నాడు. రాణా గాయం తీవ్రత ప్రకారం చూస్తే ఈ సీజన్ లో అతను ఎన్నిమ్యాచ్ లు ఆడతాడన్నది ఇంకా తేలలేదు.












Click it and Unblock the Notifications