Cheetah: కునో నేషనల్ పార్కులో మరో చిరుత మృతి..

దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన మరో చిరుత మృతి చెందింది. మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్‌ పార్క్‌లో ఉన్న చిరుత చనిపోయింది. కునో నేషనల్ పార్క్‌లో ఉన్న ఆడ చిరుత 'దక్ష' చనిపోయినట్లు అధికారులు తెలిపారు. అయితే నమిబియా, దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన చిరుతాల్లో దాదాపు 40 రోజుల్లో మూడు మృతి చెందాయి. మొదటి చిరుత నమీబియా నుంచి తీసుకొచ్చింది కాగా.. రెండోది దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన చిరుత. ఈ రెండు చిరుతలు చనిపోవడానికి అనారోగ్యమే కారణమని అధికారులు చెబుతున్నారు.

నమీబియాకు చెందిన సాషా అనే చిరుత జనవరి చివర్లో అస్వస్థతకు గురైంది. ఆ చిరుత దీర్ఘకాలిక మూత్రపిండ వైఫల్యం ఉన్నట్లు దాని రక్త ఫలితాల్లో వెల్లడైంది. సాషాను నమీబియా నుంచి తీసుకొచ్చారు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన చీతాల్లో ఒకటైన ఉదయ్‌ అనే మగ చీతా.. ఈ ఏడాది ఏప్రిల్‌ 23న అనారోగ్యానికి గురైంది. ఆ చీతాను జాగ్రత్తగా వైద్య కేంద్రానికి తీసుకొచ్చి చికిత్స చేస్తుండగా అది చనిపోయినట్లు కునో జాతీయ పార్కు చీఫ్‌ కన్జర్వేటివ్‌ అధికారి జేఎస్‌ చౌహాన్‌ తెలిపారు. ఉదయ్ టెర్మినల్ కార్డియో-పల్మనరీ ఫెయిల్యూర్‌తో మరణించినట్లు తేలింది.

cheeta

ప్రతిష్టాత్మకమైన చిరుత పునరుద్ధరణ కార్యక్రమం కింద, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత ఏడాది సెప్టెంబర్ 17న తన 72వ పుట్టినరోజున మధ్యప్రదేశ్‌లోని కునోలోని క్వారంటైన్ ఎన్‌క్లోజర్‌లోకి నమీబియా నుండి ఎనిమిది మచ్చల పిల్లి జాతులను -- ఐదు ఆడ మరియు మూడు మగ పిల్లి జాతులను విడుదల చేశారు. ప్రాజెక్ట్ చీతాలో భాగంగా కేంద్ర ప్రభుత్వం రెండు విడతల్లో 20 చీతాలను నమిబియా, దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు తీసుకొచ్చింది.

మొదటి ధఫాలో భాగంగా నమీబియా నుంచి తీసుకొచ్చిన ఎనిమిది చీతాలను గతేడాది సెప్టెంబరు 17న ప్రధాని మోదీ వాటిని కునో పార్క్‌లోని ప్రత్యేక ఎన్‌క్లోజర్‌లో విడుదల చేశారు. రెండో ధఫాలో ఫిబ్రవరి 18న 12 చీతాలను దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చి కునో నేషనల్ పార్క్ లో వదిలారు. కాగా నమీబియా నుంచి తీసుకొచ్చిన చిరుతల్లో ఒకటైన ఆశా కునో నేషనల్ పార్క్‌లో 4 పిల్లలకు జన్మనిచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+