యోగీ ఆదిత్యనాథ్ ను చంపేస్తామంటూ మరో కాల్ - యూపీలో పోలీసుల అలర్ట్..
ఉత్తర్ ప్రదేశ్ లో మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్న సీఎం యోగీ ఆదిత్యనాథ్ కు ప్రాణహాని కూడా అంతకంతకూ పెరుగుతోంది. ముఖ్యంగా తాజాగా చోటు చేసుకున్న వరుస ఎన్ కౌంటర్లు, హత్యల తర్వాత యోగీ ఆదిత్యనాథ్ ను చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. పోలీసు స్టేషన్లకు, ప్రభుత్వ టోల్ ఫ్రీ నంబర్లకు ఇలా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. వీటిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ను చంపేస్తామని బెదిరిస్తూ తాజాగా ప్రభుత్వ టోల్ ఫ్రీ నంబర్ 112కు ఓ కాల్ వచ్చింది. అత్యవసర సర్వీసుల కోసం యోగీ సర్కార్ తాజాగా ప్రారంభించిన 112 నంబర్ కు కాల్ రావడంతో పోలీసులు కూడా వెంటనే అప్రమత్తమయ్యారు. వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఓ గుర్తు తెలియని అగంతకుడు ఇలా కాల్ చేసి బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు.

ఏకంగా సీఎం యోగీకే బెదిరింపు రావడంతో '112' ఆపరేషన్ కమాండర్ సుశాంత్ గోల్ఫ్ సిటీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 506, 507, ఐటీ చట్టం 66 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 112కు డయల్ చేసిన తర్వాత గుర్తు తెలియని వ్యక్తిపై సుశాంత్ గోల్ఫ్ సిటీ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ప్రాణహాని ఉందని పోలీసులు తెలిపారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను చంపేస్తామని బెదిరింపు రావడంతో లక్నోలో గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తాజాగా వెల్లడించారు. డయల్ 112 (అత్యవసర సేవల కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన నంబర్)కు సందేశం ద్వారా బెదిరింపు వచ్చిందని, అందులో "నేను త్వరలో సీఎం యోగిని చంపుతానని ఆ వ్యక్తి పేర్కొన్నాడని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications