ముంచుకొస్తున్న మరో ప్రమాదం.. చికిత్సలేని సూపర్ బగ్స్!

యాంటీబయాటిక్స్ విపరీతంగా వాడుతున్నారా? అయితే డేంజర్ అని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు. యాంటీబయాటిక్స్ మితిమీరిన వినియోగం, దుర్వినియోగం కారణంగా మానవ మనుగడ ప్రమాదంలో పడుతుందని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. 1990వ సంవత్సరం నుంచి 2021 మధ్య ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెంట్ కారణంగా 10 లక్షల మంది చనిపోయినట్టు తాజాగా లాన్సెట్ ఒక అధ్యయనంలో పేర్కొంది.

యాంటీబయాటిక్స్ ఎక్కువ వినియోగంతో డేంజర్
అత్యంత ప్రమాదకరంగా మారుతున్న ఈ సమస్యను పరిష్కరించకపోతే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని మనం బ్యాక్టీరియాలను, శిలీంద్రాలను చంపేందుకు ఉపయోగించే యాంటీబయాటిక్స్ ను ఎదుర్కొనే క్రమంలో ఇవి యాంటీ మైక్రోబియల్ రెసిస్టెంట్ గా రూపాంతరం చెందుతున్నాయని, ఫలితంగా చికిత్సలేని సూపర్ బగ్స్ తయారవుతున్నాయని హెచ్చరిస్తున్నారు. దీనివల్ల తర్వాత వచ్చే ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడం కష్టంగా మారుతుందని, సర్జరీలు, క్యాన్సర్ ట్రీట్మెంట్స్ కు ఇది కృష్ణతరంగా మారుస్తుందని చెబుతున్నారు.

Another looming danger superbugs kills 4 crore people worldwide by 2050

సూపర్ బగ్స్ తో ప్రమాదం
ప్రస్తుత ఆరోగ్య సంరక్షణలో యాంటీబయాటిక్స్ కీలకపాత్ర పోషిస్తున్నప్పటికీ వీటి మితిమీరిన వినియోగం ఏమాత్రం మంచిది కాదని ఇవి ఆందోళనకరమైన సూపర్ బగ్స్ ను తయారు చేస్తున్నాయని చెబుతున్నారు. వాషింగ్టన్ యూనివర్సిటీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవల్యూషన్ టీం మనుషులు మరియు జంతువులలో యాంటీబయాటిక్స్ యొక్క మితిమీరిన దుర్వినియోగాన్ని దానివల్ల ఏర్పడుతున్న భయంకరమైన పరిస్థితులను అధ్యయనం ద్వారా వెల్లడించారు.

2050 నాటికి తీవ్ర పరిణామాలు
ఇక ఈ పరిణామాలు మారకపోతే ఇదేవిధంగా కొనసాగితే 2050 నాటికి యాంటీ మైక్రోబియల్ రెసిస్టెంట్ అదనపు ఆరోగ్య సంరక్షణ ఖర్చు ఏకంగా ట్రిలియన్ డాలర్లుగా ఉంటుందని మన ఇండియన్ కరెన్సీ లో చెప్పాలంటే దాదాపు 83 లక్షల కోట్లకు చేరుకుంటుందని దీనివల్ల ప్రపంచ జీడీపీ 3.8% కోల్పోతుందని చెబుతున్నారు.

2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా నాలుగు కోట్ల మంది మరణాలకు ఛాన్స్
2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా నాలుగు కోట్ల మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని కూడా షాకింగ్ అధ్యయనాన్ని వెల్లడించారు.అందుకే యాంటీ బయాటిక్స్ మితిమీరిన వినియోగం మంచిది కాదని అందరూ గుర్తించాలి. వైద్యులు కూడా దీనిని గుర్తించి యాంటీ బయాటిక్స్ రోగులకు ప్రిస్క్రైబ్ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+