ప్రపంచానికి పొంచివున్న మరో మహమ్మారి ముప్పు.. డిసీజ్ X!!

ప్రపంచానికి మరో మహమ్మారి ముప్పు పొంచి ఉందని బ్రిటన్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. డిసీజ్ ఎక్స్ (Disease X) రూపంలో ప్రపంచానికి మరో పెను ప్రమాదం పొంచి ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి పునరావృతమయ్యే నేపథ్యంలో యూకే లోని ఆరోగ్య సంరక్షణ నిపుణులు ఇప్పుడు డిసీజ్ ఎక్స్ అనే కొత్త మహమ్మారిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్త వైరస్లను ఎదుర్కోవడానికి అందరూ సిద్ధంగా ఉండాలని వారు సూచిస్తున్నారు.

కరోనా మహమ్మారి తరహాలో డిసీజ్ ఎక్స్ కూడా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిపై ప్రభావం చూపిస్తుందని బ్రిటన్ వ్యాక్సిన్ టాస్క్ ఫోర్స్ (Britin vaccine task force) కు నాయకత్వం వహిస్తున్న డేమ్ కేట్ బింగ్ హామ్ పేర్కొన్నారు. కరోనా మహమ్మారి కంటే డిసీజ్ ఎక్స్ ప్రజలపై ఏడు రెట్లు అధిక ప్రభావం చూపిస్తుందని బ్రిటన్ శాస్త్రవేత్తలు వెల్లడించారు.

Another pandemic threat to the world.. Disease X!!

ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం మరో మహమ్మారిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ఎంతోకాలంగా సూచిస్తుంది. తాజాగా బ్రిటన్ శాస్త్రవేత్తలు చెప్పిన ఈ విషయం ఆందోళనకు కారణంగా మారింది. ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న అనేక వైరస్ లు వేగంగా రూపాంతరం చెందుతున్నాయని పేర్కొన్న బ్రిటన్ శాస్త్రవేత్తలు వాటినన్నింటిని ప్రమాదకరమైన వైరస్ లు గా పరిగణించలేమని, వాటిలో కొన్ని మాత్రమే డేంజరస్ గా మారుతున్నాయని పేర్కొన్నారు.

కొన్ని మాత్రమే మనుషులపై తీవ్రమైన ప్రభావాన్ని చూపించవచ్చు అని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. వేలకొద్ది వైరస్ లు ఉన్న 25 వైరస్ కుటుంబాలను నిత్యం పర్యవేక్షిస్తున్న శాస్త్రవేత్తలు, వాటిలో ఏదైనా మహమ్మారి గా పరిణమించే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

కరోనా మహమ్మారి సోకిన వారు చాలామంది కోలుకోగలిగారు. అయితే డిసీజ్ ఎక్స్ కరోనా మహమ్మారి కంటే ఏడు రెట్లు తీవ్రంగా ఉంటుందని, అధిక ప్రభావం చూపిస్తుందని ఈ వైరస్ వారి నుంచి ప్రజలు బయటపడడం కష్టమని బ్రిటన్ శాస్త్రవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే డిసీజ్ ఎక్స్ నుండి బయటపడడం కోసం బ్రిటన్ శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ అభివృద్ధి చేసే పనిలో ఉన్నారు. ఏది ఏమైనా కరోనా మహమ్మారి తరహాలో డిసీజ్ ఎక్స్ వ్యాప్తి చెందుతుంది అని చెప్పడం మాత్రం ప్రస్తుతం అందరిలో ఆందోళన కలిగిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+