Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

షీనా హత్యలో షాకింగ్: ప్రీగా ఇంద్రాణికి అతను సాయం

ముంబై: షీనా బోరా హత్య కేసులో మరో షాకింగ్ అంశం వెలుగు చూసింది. షీనా హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి కోసం... ఆమె డ్రైవర్ ఉచితంగా హత్యలో సహకరించాడట.

ఇంద్రాణి ముఖర్జీయాకు డ్రైవర్ శ్యాం రాయ్ ఉచితంగా సహకరించాడని పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. డ్రైవర్... ఇంద్రాణి నుంచి లేదా ఆమె రెండో భర్త సంజీవ్ ఖన్నా నుంచి ఎలాంటి డబ్బు లేదా ఇతరాలు తీసుకోలేదు. అయితే, అతను ఆమె వద్ద ఉద్యోగం మానేసే సమయంలో.. ఇంద్రాణి అతనికి రూ.1లక్ష ఇచ్చింది.అయితే, ఆ రూ.1లక్ష కూడా అతనికి హత్య చేసినందుకు ఇచ్చింది కాదు. అది అదని మూడు నెలల జీతం.

షీనాను హత్య చేశాక.. ఇంద్రాణి తన కార్లను అన్నింటిని అమ్మేసినట్లు డ్రైవర్ పోలీసులకు చెప్పాడు. డ్రైవర్ రాయ్ కూడా తప్పనిపరిస్థితుల్లో అక్కడ ఉద్యోగం చేశాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఉద్యోగం మానేద్దామని నిర్ణయించుకున్నాడు. ఆ సమయంలో డ్రైవర్‌కు ఆమె రూ.లక్ష ఇచ్చింది. అది అతని మూడు నెలల వేతనం.

Another shocker! Driver helped Indrani Mukerjea to kill Sheena Bora for free!

షీనా పంపిన మెయిల్స్.. కాదు!

షీనా అమెరికాలో ఉన్నట్లు అందర్నీ ఇంద్రాణి నమ్మించిన విషయం తెలిసిందే. ఇందుకోసం పీటర్, మిఖాయిల్‌లకు షీనా అమెరికా నుంచి మెయిల్స్ పంపించింది. అయితే, వాటిని ఇంద్రాణి పంపించినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇంద్రాణి అమెరికా వెళ్లినప్పుడు అక్కడి నుంచి షీనా పంపినట్లుగా మెయిల్స్ పంపించింది.

షీనా పేరిట ఫేక్ ఈ మెయిల్ ఓపెన్ చేయాలని తన కంపెనీలో చేసే వారికి ఇంద్రాణి ఆదేశించింది. పాస్ వర్డ్, ఈ మెయిల్ తీసుకొని.. షీనా పంపించినట్లుగా ఇంద్రాణి వారికి మెయిల్స్ పంపించింది.

కస్టడీ పొడిగింపు

షీనా హత్యకేసులో ప్రధాన నిందితులు ఇంద్రాణి ముఖర్జీ, సంజీవ్ ఖన్నా, శ్యామ్‌ రాయ్‌ల పోలీస్ కస్టడీని ఈ నెల ఏడో తేదీ వరకు పొడిగిస్తూ ముంబైలోని బాంద్రా కోర్టు మేజిస్ట్రేట్ ఎస్ ఎం చాంద్‌గడే ఆదేశాలు జారీ చేశారు. ఇంతకుముందు విధించిన పక్షం రోజుల కస్టడీ గడువు ముగిసిపోవడంతో ముంబై పోలీసులు వారిని శనివారం న్యాయస్థానం ముందు హాజరు పర్చారు.

కేసు దర్యాప్తులో ఇంద్రాణి పోలీసులకు సహకరించడం లేదని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ వైభవ్ బగాడే వాదించారు. కేసు దర్యాప్తు పరిధి పెద్దదని, నిందితులు నోరు మెదపటం లేదని, హత్యకు ఈ - మెయిల్, ఇంటర్నెట్‌తో ప్రణాళిక వేశారన్నారు. కేసు దర్యాప్తు విస్తృతి దృష్ట్యా కస్టడీ సమయం చాలా తక్కువగా ఉందని తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+