మరోసారి ప్రకాష్ రాజ్ పై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు

బెంగళూరు సెంట్రల్ నుండి స్వతంత్ర అభ్యర్థిగా లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగిన సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కేసులో అడ్డంగా బుక్ అయ్యారు. ప్రకాష్ రాజ్ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని ఆయన పైన అందిన ఫిర్యాదుతో గతంలోనే ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదైంది. తాజాగా మరోమారు ఆయనపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదుకు సిఫారసు చేసారు అధికారులు.

మరోసారి అడ్డంగా బుక్కయిన ప్రకాష్ రాజ్

మరోసారి ప్రకాష్ రాజ్ పై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదైంది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ కి వ్యతిరేకంగా పోలీస్ కేసు నమోదు చేశారు. నామినేషన్‌ వేసే సమయంలో వినియోగించిన ఆటోకు అనుమతి తీసుకోలేదని నటుడు ప్రకాశ్‌రాజ్‌పై బెంగళూరులోని అశోక్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ దాఖలైంది. ప్రకాష్ రాజ్ మార్చి 22న ఆటోలో వెళ్లి నామినేషన్‌ దాఖలు చేశారు. దానికి ఆయన అనుమతి తీసుకోకపోవడం ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కిందకే వస్తుందని అభిప్రాయపడ్డ రిటర్నింగ్‌ అధికారి ఆయనపై కేసు నమోదుకు సిఫారసు చేశారు.

another time violation of the model code of conduct.. Prakash raj booked

గతంలోనూ అనుమతి లేకుండా ప్రచారం నిర్వహించినందుకు కేసు నమోదు

మార్చి 12వ తేదీన బెంగళూరు మహాత్మా గాంధీ సర్కిల్ దగ్గర అనుమతి లేకుండా మైక్ వినియోగిస్తూ రాజకీయ ప్రచారం చేశారని, తనకు ఓటు వేయాల్సిందిగా అందరిని విజ్ఞప్తి చేశారని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు కొందరు స్థానికులు. మీడియా మరియు ఫ్రీడమ్ ఎక్స్ప్రెషన్ బ్యానర్ కింద నిర్వహించిన పబ్లిక్ ర్యాలీలో పాల్గొన్న ప్రకాష్ రాజ్ అది రాజకీయపరమైన ర్యాలీ కానప్పటికీ ఆ ర్యాలీలో అనుమతి లేకుండా కాన్వాసింగ్ నిర్వహించారు. చాలామంది రచయితలు, ఉద్యమకారులు, కళాకారులు పాల్గొన్న ఆ ర్యాలీలో తనకు ఓటు వేయాల్సిందిగా ప్రకాష్ రాజ్ అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఎన్నికల ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రకాష్ రాజ్ మాట్లాడుతున్న వీడియోను తీసిన కొందరు ఆ వీడియోను ఎన్నికల అధికారులకు వాట్సాప్ ద్వారా పంపించారు. ఆ వీడియోలు చూసిన ఎన్నికల అధికారులు అక్కడకు వెళ్లేసరికి కార్యక్రమం పూర్తి అయింది. ఈ నేపథ్యంలో ఎలక్షన్ కోడ్ ఉల్లంఘనకు పాల్పడిన ప్రకాశ్ రాజ్ పై వాట్సాప్ లో వచ్చిన వీడియో ఆధారంగా కేసు నమోదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+