అనూహ్య: నిందితుడికి 29 వరకు జ్యూడిషియల్ కస్టడీ
ముంబై: కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన సాఫ్టువేర్ ఇంజనీర్ అనూహ్య హత్య కేసులో ప్రధాన నిందితుడు చంద్రభాన్ సనప్(38)కు స్థానిక న్యాయస్థానం ఈ నెల 29వ తేదీ వరకు జ్యూడిషియల్ కస్టడీని విధించింది. నిందితుడికి గుర్తింపు కవాతు, వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. దీంతో కోర్టు శనివారం ఈ మేరకు కస్టడీ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా, అనూహ్య హత్య కేసులో మిస్టరీ ఈ నెల 3న వీడింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేసింది. ఈ ఘటనలో నిందితుడిని ముంబై సిట్ పోలీసులు నాసిక్‌లో పన్నెండు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నారు.
లోకమాన్య తిలక్ రైల్వే స్టేషన్ నుండి అనూహ్యను తీసుకెళ్లినట్లు సిసిటివి ఫుటేజిలో ఉన్న వ్యక్తి, నాసిక్‌లో సిట్ అదుపులోకి తీసుకున్న వ్యక్తి ఒక్కరేనని పోలీసులు తేల్చారు. నిందితుడు కూడా విచారణలో తన నేరాన్ని అంగీకరించాడు.

కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన సాఫ్టువేర్ ఇంజనీర్ అనూహ్య జనవరి నెలలో హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసును ముంబై పోలీసులు విచారణ చేపట్టారు. ఇటీవలె హత్య జరిగిన దాదాపు యాభై రోజుల తర్వాత కేసు ముగింపు దశకు చేరుకుంది. రైల్వే స్టేషన్ నుండి అనూహ్యతో వెళ్లిన వారు ఎవరనే విషయమై పోలీసులు దర్యాఫ్తు చేశారు.
రైల్వే స్టేషన్‌లో అనుమానితుడి అస్పష్టమైన పిక్చర్‌ను గతంలో విడుదల చేసిన పోలీసులు, ఆ తర్వాత స్పష్టమైన పిక్చర్ విడుదల చేశారు. ఫోటోలో ఉన్న వ్యక్తిని గుర్తిస్తే తమకు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు. మరోవైపు క్రైమ్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్ అనూహ్య కేసుకు సంబంధించి రివ్యూ చేశారు. బలమైన ఆధారాలు లభించాయని, టీమ్స్ దీనిపై పని చేస్తున్నాయని చెప్పారు. ఆ తర్వాత మూడున నిందితుడిని పట్టుకున్నారు.












Click it and Unblock the Notifications