అనూహ్య కేసును కొలిక్కి తెస్తున్నారు!: పురోగతి కానీ..

ముంబై: కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన సాఫ్టువేర్ ఇంజనీర్ అనూహ్య హత్య కేసులో ముంబై పోలీసులు పురోగతిని సాధిస్తున్నారు. హత్య జరిగిన దాదాపు యాభై రోజుల తర్వాత కేసు ముగింపు దశకు చేరుకున్నట్లుగా కనిపిస్తోంది. రైల్వే స్టేషన్ నుండి అనూహ్యతో వెళ్లిన వారు ఎవరనే విషయమై పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.

అతనిని ఎక్యాగా (నిక్ నేమ్)గా గుర్తించినట్లు తెలుస్తోంది. అతను గతంలో రైల్వే పోర్టర్‌లో పని చేసినట్లుగా గుర్తించినట్లు తెలుస్తోంది. అతను కొన్నేళ్ల క్రితం ఉద్యోగం నుండి మానేశాడు. ఆ సమయంలో అతను తాను నివసించే థానే చిరునామా ఇచ్చాడు. దీంతో పోలీసులు థానేలోని అతని ఇంటికి వెళ్లారు.

Anuhya murder was 'almost' solved

అక్కడ ఎక్యా చిత్రాన్ని ఆమె తల్లి గుర్తించారు. ఎక్యా నాసిక్ వెళ్లినట్లుగా అతని తెల్లి చెప్పారు. నాసిక్ వెళ్లి చూడగా అక్కడి నుండి యావత్మాల్ వెళ్లినట్లు గుర్తించారు. అక్కడికి వెళ్లగా... తిరిగి అతను నాసిక్ వెళ్లినట్లుగా పోలీసులు తెలుసుకున్నారు. నాసిక్ వెళ్లి అతనిని విచారించారు.

పోలీసులు అతనిని నాలుగు నుండి ఐదు గంటల పాటు విచారించారు. అనూహ్య ఘటన రోజు అతను థానేలో ఉన్నట్లుగా పోలీసులకు చెప్పాడు. దీంతో పోలీసులు అతను ఈ కేసులో నిందితుడి కాదని గుర్తించినట్లుగా సమాచారం. దీంతో అతనికి క్లీన్ చిట్ ఇచ్చారని తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి దాదాపు పన్నెండు మంది అనుమానితులను పోలీసులు విచారించారు.

కాగా, రైల్వే స్టేషన్‌లో అనుమానితుడి అస్పష్టమైన పిక్చర్‌ను గతంలో విడుదల చేసిన పోలీసులు, సోమవారం స్పష్టమైన పిక్చర్ విడుదల చేశారు. ఫోటోలో ఉన్న వ్యక్తిని గుర్తిస్తే తమకు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు. మరోవైపు క్రైమ్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్ అనూహ్య కేసుకు సంబంధించి రివ్యూ చేశారు. బలమైన ఆధారాలు లభించాయని, టీమ్స్ దీనిపై పని చేస్తున్నాయని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+