వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నన్ను స్ఫూర్తిగా తీసుకోకండి: బలవంతంగా సారీ చెప్పిన 'దంగల్' అమ్మాయి

దంగల్ సినిమాలో నటించిన జైరా వసీమ్ (16) వివాదంలో చిక్కుకున్నారు. కాశ్మీర్ అమ్మాయిలు తనను స్ఫూర్తిగా తీసుకోవాలని ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: దంగల్ సినిమాలో నటించిన జైరా వసీమ్ (16) వివాదంలో చిక్కుకున్నారు. కాశ్మీర్ అమ్మాయిలు తనను స్ఫూర్తిగా తీసుకోవాలని ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

జైరా వ్యాఖ్యల పైన కాశ్మీర్ వేర్పాటువాదులు మండిపడ్డారు. దీంతో ఆమె క్షమాపణ చెప్పింది. దుంగల్ సినిమాలో రెజ్లర్ గీత పొగట్ చిన్నప్పటి పాత్లలో జైరా వసీం నటించి మెప్పించింది. ఆమె సొంత రాష్ట్రం జమ్ము కాశ్మీర్.

ముఫ్తీని కలిసిన జైరా

ముఫ్తీని కలిసిన జైరా

జైరా తల్లిదండ్రులతో కలిసి శనివారం కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబాబా ముఫ్తీని కలిశారు. విద్యాభ్యాసం, కెరీర్, దంగల్ సినిమా షూటింగు గురించిన అనుభవాలను ఆమెతో పంచుకున్నారు.

క్షమాపణ

క్షమాపణ

కాశ్మీర్ అమ్మాయిలు తనను స్ఫూర్తిగా తీసుకోవాలని తర్వాత ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. ఆమె వ్యాఖ్యలను వేర్పాటువాదులు తీవ్రంగా ఆక్షేపించారు. దీంతో తన వ్యాఖ్యలను తొలగించి క్షమాపణ చెప్పింది. ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించాలని వేడుకుంది. తనను ఎవరూ ప్రేరణగా తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పింది.

సానుభూతి

సానుభూతి

కాశ్మీరీ యువతకు రోల్ మోడల్‌గా తనను చూపించారని, తనను ఎవరూ స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం లేదని, తాను 16 ఏళ్ల అమ్మాయిని అని, తన వయసును దృష్టిలో పెట్టుకొని తాను చేసిన వ్యాఖ్యలను చూడాలని జైరా కోరింది. జైరా పైన నెటిజన్లు సానుభూతి వ్యక్తం చేశారు. 16 ఏళ్ల అమ్మాయితో బలవంతంగా క్షమాపణ చెప్పించారని మండిపడ్డారు.

పలువురి మద్దతు

పలువురి మద్దతు

కాగా, అప్పటికే జైరా రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు జైరాని సపోర్ట్‌ చేశారు.

ఇదేనా ఆజాదీ?

ఇదేనా ఆజాదీ?

ఆజాదీ ఆజాదీ అంటూ గొంతు చించుకుని అరుస్తుంటారు కానీ తోటివారిపై మాత్రం ఇసుమంతైనా ఆజాదీ చూపించరని, పాపం జైరా వసీం.. తాను గెలిచినందుకే క్షమాపణలు చెప్పిందని, ఇది సిగ్గుపడాల్సిన విషయమని ప్రముఖ బాలీవుడ్‌ పాటల రచయిత జావేద్‌ అక్తర్‌ ట్వీట్‌ చేశారు.

ముఫ్తీ, ఒమర్ కూడా.

ముఫ్తీ, ఒమర్ కూడా.

ఆయనతో పాటు మెహబూబా ముఫ్తీ, జమ్మూ కాశ్మీర్‌ మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా కూడా జైరా చేత బలవంతంగా క్షమాపణ చెప్పించడం అన్యాయమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జైరా వసీమ్ తన రోల్ మోడల్ అని అనుపమ్ ఖేర్ ట్వీట్ చేశారు.

English summary
Anupam Kher lauds Dangal girl Zaira Wasim’s strength: ‘You are my role model’
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X