విపక్ష నేతల ఫోన్లు హ్యాక్-ఆధారాలు బయటపెట్టిన రాహుల్-ఆపిల్ షాకింగ్ రియాక్షన్..

దేశంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో పాటు పలువురు విపక్ష నేతల ఫోన్లు హ్యాక్ అవుతున్నట్లు తాజాగా నోటిఫికేషన్లు వచ్చాయి దీనిపై ఇవాళ రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఇలా తనతో పాటు సెక్యూరిటీ అలర్ట్ అందుకున్న విపక్ష నేతలు అసదుద్దీన్ ఓవైసీ, సీతారాం ఏచూరీ, ప్రియాంక చతుర్వేది, రాఘవ్ చద్దా వంటి పేర్లను కూడా వెల్లడించారు. తామందరికీ ఒకే తరహాలో ఫోన్ల హ్యాకింగ్ మెసేజ్ లు వచ్చినట్లు రాహుల్ చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.

ఆపిల్ ఫోన్లు వాడుతున్న వీరందరికీ తమ ఫోన్లు హ్యాక్ అయినట్లు తాజాగా మెసేజ్ లు వచ్చాయి. అలాగే మీ స్ధానిక ప్రభుత్వ మద్దతు ఉన్న హ్యాకర్లు దీని వెనుక ఉన్నట్లు యాపిల్ నుంచి వీరికి హెచ్చరికలు అందాయి. దీంతో రాహుల్ గాంధీ కేంద్రమే వీటిని చేయిస్తోందంటూ ఆరోపించారు. దీనిపై కేంద్రం స్పందించాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోడీకి సన్నిహితుడైన అదానీయే ఇదంతా చేయిస్తున్నారంటూ రాహుల్ గాంధీ మరో విమర్శ కూడా చేశారు.

Apple reacts to Rahul Gandhis claims on Opposition Leaders phones hacking, says sometimes..

రాహుల్ ఆరోపణలు భారత్ తో పాటు పలు దేశాల్లో కలకలం రేపాయి. అలాగే యాపిల్ పైనా హ్యాకింగ్ ఆపలేకపోతున్నారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో అమెరికాకు చెందిన సెల్ ఫోన్ల తయారీ సంస్ధ యాపిల్ స్పందించింది. తాము ఎవరి గురించీ నిర్దిష్టంగా ఆరోపణలు చేస్తూ నోటిఫికేషన్లు పంపలేదని పేర్కొంది. ఇంకా చెప్పాలంటే తాము పంపే నోటిఫికేషన్లలో కొన్ని తప్పుడు సందేశాలు కూడా ఉండొచ్చని కూడా తెలిపింది. దీంతో రాహుల్ ఆరోపణల గాలి తీసేసింది.

ఆపిల్ టెక్నికల్ సపోర్ట్ పేజీలో చేసిన ప్రకటనలో యాపిల్.. రాష్ట్ర-ప్రాయోజిత దాడి చేసేవారు చాలా బాగా నిధులు కలిగి, అధునాతనంగా ఉంటారని తెలిపింది. అటువంటి దాడులను గుర్తించడం అనేది తరచుగా అసంపూర్ణమైన ముప్పు గూఢచార సంకేతాలపై ఆధారపడుతుందని క్లారిటీ ఇచ్చింది.ఇందులో కొన్ని నోటిఫికేషన్‌లు తప్పుడు అలారాలు కావచ్చు లేదా కొన్ని దాడులు గుర్తించబడకపోవచ్చు అని కంపెనీ తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+