విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..!
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్. బీఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14 న దేశంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, బ్యాంకులకు సెలవు ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. ఏప్రిల్ 14, 2026 (మంగళవారం) డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటిస్తూ డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అన్ని డిపార్ట్ మెంట్స్ తమ ఉద్యోగులకు తెలియజేయాలని పేర్కొంది.
ఇక తాజా నిర్ణయంతో దేశవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు ఆ రోజు మూతబడనున్నాయి. అయితే మరికొద్ది రోజుల్లో పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరికొన్ని సెలవులు రావడంతో విద్యార్థులు ఎగిరి గంతేస్తున్నారు. అయితే ఈ సెలవులు ఏప్రిల్ 8 నుంచి ఏప్రిల్ 14 మధ్య నాలుగు రోజులు హాలీడేస్ రానున్నాయి. దాంతో స్కూళ్లు, ఆఫీసులు మూతపడుతుండడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అయితే బుధవారం ఏప్రిల్ 8న పంజాబ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సెలవు ప్రకటించింది. శ్రీ గురునాభా దాస్ జీ జయంతి సందర్భంగా గెజిటెడ్ సెలవు దినంగా అధికారులు ప్రకటించారు. అలాగే ఏప్రిల్ 11 న రెండో శనివారం కావడంతో అధికారికంగా పాఠశాలలు, కాలేజీలు, ఆఫీసులు మూతపడనున్నాయి. అలాగే ఏప్రిల్ 12న ఆదివారం సెలవు దినం తెలిసిందే.

ఇక ఏప్రిల్ 13 సోమవారం పంజాబ్ రాష్ట్రంలో వైశాఖ పూర్ణిమ పండుగను జరుపుకోనున్నారు. దాంతో వైశాఖ పౌర్ణమి సందర్భంగా పంజాబ్ ప్రభుత్వం ఏప్రిల్ 13న అన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించింది. అలాగే ఏప్రిల్ 14 న అంబేద్కర్ జయంతి సందర్భంగా దేశ వ్యాప్తంగా పాఠశాలలు, కాలేజీలు మూతపడనున్నాయి. ఈ క్రమంలో విద్యార్థులు ఫుల్ జోష్ లో ఉన్నారు. మరికొద్ది రోజుల్లో వేసవి సెలవులు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈలోపే మరో నాలుగు రోజులు సెలవులు రావడంతో స్టూడెంట్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.












Click it and Unblock the Notifications