అరేబియా సముద్రాన్ని ఆక్రమించిన పాకిస్థాన్.. రంగంలోకి భారత్ .. ఒక్క దెబ్బతో..!!
భారత్ సరిహద్దు దేశం పాకిస్థాన్ ఎప్పుడూ మనపై దాడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. గతేడాది పహల్గామ్ దాడి తర్వాత ఇరు దేశాల ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా పాకిస్థాన్ తన వ్యూహాత్మక మిసైల్ టెస్టింగ్ కోసం అరేబియా సముద్రంలోని కొంత భాగాన్ని తన అధీనంలోకి తీసుకున్నట్లు నిఘా వర్గాలు తేల్చాయి. దాంతో వెంటనే భారత్ నేవీ రంగంలోకి దిగింది. భారత్ కు చెందిన అత్యాధునిక యుద్ధనౌక ఐఎన్ఎస్ ధ్రువ్ ను అరేబియా సముద్రంలోకి దింపింది. దాంతో భారత్- పాకిస్థాన్ మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
భారత్- పాకిస్థాన్ మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినట్లు స్పష్టం అవుతోంది. భారత్- పాకిస్థాన్ మధ్య అరేబియా సముద్రంలో ఉత్కంఠ నెలకొంది. పాకిస్థాన్ వ్యూహాత్మకంగా పరీక్షిస్తున్న మిసైల్స్ కోసం అరెబియా సముద్రంలోని కొంత భాగాన్ని ఆక్రమించిన నేపథ్యంలో భారత్ వెంటనే స్పందించింది. ఏప్రిల్ 14-15 మధ్య కరాచీ, ఓర్మారా, గ్వదర్, సోన్మియాని సమీపంలోని సముద్ర ప్రాంతంలో 415 కి.మీ నుండి దాదాపు 450 కి.మీ. మేర క్షిపణి పరీక్షల కోసం పాకిస్థాన్ నోటమ్ జారీ చేసింది. అయితే పాకిస్థాన్ మిసైల్ టెస్టుపై భారత్ తక్షణమే స్పందించింది.

పాకిస్థాన్ మిసైల్ టెస్టుకు 24 గంటల ముందే.. భారత్ తన వద్ద ఉన్న అత్యాధునిక యుద్ధనౌక ఐఎన్ఎస్ ధ్రువ్ ను అరేబియా సముద్రంలోకి దింపింది. దాంతో పాకిస్థాన్ ఒక్కసారిగా షాక్ కు గురైంది. ఇక అత్యాధునిక యుద్ధనౌక ఐఎన్ఎస్ ధ్రువ్ శత్రు దేశాల క్షిపణులను ట్రాక్ చేస్తుంది. అలాగే సముద్రంపై పూర్తిస్థాయిలో గస్తీ నిర్వహిస్తుంది. ఇది శత్రు దేశాలు ప్రయోగించే మిసైల్, క్రూయిజ్ మిసైల్స్ వేగాన్ని, గమ్యాన్ని అలాగే దూరం, లక్ష్యంపై నిఘా పెట్టగలదు. ఐఎన్ఎస్ ధ్రువ్.. వందల కిలోమీటర్ల దూరంలోని క్షిపణులను కూడా ట్రాక్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.












Click it and Unblock the Notifications