వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లక్ష్యసాధనలో పదేపదే ఫెయిల్ అవుతున్నారా? మీలో ఈ 4లక్షణాలు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి!!

|
Google Oneindia TeluguNews

జీవితంలో అనుకున్నది సాధించాలంటే ఏం చేయాలి? ఎలా ఉంటే మనం జీవితంలో అనుకున్నది సాధించటానికి సాధ్యపడుతుంది. చాలామంది కష్టపడి పని చేసినప్పటికీ వారు అనుకున్నది సాధించలేరు. నేను ఎంత ప్రయత్నం చేసినా అనుకున్నది సాధ్యపడడం లేదని బాధపడే వారు ఎంతో మంది ఉంటారు. అయితే జీవితంలో అనుకున్నది సాధించాలంటే కష్టపడి పని చేయడం మాత్రమే సరిపోదని చాలామంది వ్యక్తిత్వ వికాస నిపుణులు చెబుతున్నారు.

స్థిరమైన లక్ష్యం ఉండాలి

స్థిరమైన లక్ష్యం ఉండాలి

జీవితంలో అనుకున్నది సాధించాలంటే ముందుగా స్థిరమైన లక్ష్యాన్ని ఎంచుకోవడం ముఖ్యం. కొంతమంది పరిస్థితులకు తగ్గట్టుగా మారి పోతూ ఉంటారు. లక్ష్యాలను కూడా అదే విధంగా మార్చుకుంటూ ఉంటారు. అయితే అనుకున్నది సాధించాలి అనుకున్న వారు ఒక స్థిరమైన లక్ష్యాన్ని కలిగి ఉండాలని, దానిని సాధించటానికి ప్రయత్నించాలని చెప్తున్నారు. అయితే వారు ఎంచుకున్న లక్ష్యం కూడా వారి సామర్థ్యానికి తగినట్టుగా ఉండాలని చెబుతున్నారు. కచ్చితంగా ప్రతీ ఒక్కరు తమ సామర్ధ్యాలను బేరీజు వేసుకుని లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి.

ప్రణాళిక ఉండాలి

ప్రణాళిక ఉండాలి

ఏదైనా అనుకున్నది సాధించాలంటే సరైన ప్రణాళిక కూడా ఉండాలి. ప్రణాళికాబద్ధంగా ప్లాన్ చేసుకున్నప్పుడే లక్ష్యసాధన సులువవుతుంది. ప్లాన్ లేకుండా ఎంత కష్టపడినా, ఫలితం ఉండబోదు. అందుకే ఏ పని చేసినా ఎప్పుడు చేయాలి? ఎలా చేయాలి? ఎంత సమయం పాటు కష్టపడితే మంచి ఫలితం వస్తుంది అనేది తెలిసి ఉండాలి. అలా పక్కా ప్లాన్డ్ గా ప్రయత్నిస్తేనే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి అవకాశం ఉంటుంది.

పట్టుదలతో పని చేయాలి

పట్టుదలతో పని చేయాలి

అనుకున్నది సాధించాలనుకునే వారు పట్టుదలతో పని చేయాల్సిన అవసరం ఉంది. పట్టుదలతో ప్రయత్నం చేస్తే తప్పక విజయం సాధించే అవకాశం ఉంది. అందుకే లక్ష్యాన్ని సాధించాలి అనుకునేవారు సరైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని పట్టుదలతో పని చేయాలి. లక్ష్య సాధన క్రమంలో ఓటమి ఎదురైనా, వెనక్కి తగ్గకుండా పట్టుదలతో ప్రయత్నం చేయాలి. లక్ష్యాన్ని సాధించడంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా, ఎన్ని సమస్యలు వచ్చినా పట్టువదలని విక్రమార్కుడిలా కష్టపడాలి. అలాంటి వారే అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతారు.

అకుంఠిత దీక్షతో కష్టపడాలి

అకుంఠిత దీక్షతో కష్టపడాలి

స్థిరమైన లక్ష్యంతో, పక్కా ప్లాన్ తో, పట్టుదలతో పనిచేయడంతో పాటు దాన్ని సాధించడం కోసం తగినంత శ్రమ చేయాలి. అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి అనుకున్న వారు ఆ లక్ష్య సాధనకు ఎన్ని గంటలు కష్టపడాలి. ఎంత సమయాన్ని వెచ్చిస్తే తాము అనుకున్నది సాధిస్తాము అనేది తెలిసి ఉండాలి. దానికి వారికి కావలసిన ముఖ్యమైన గుణం అకుంఠిత దీక్ష. అకుంఠిత దీక్షతో శ్రమ చేస్తే కష్టానికి తగిన ఫలితం ఖచ్చితంగా వచ్చితీరుతుందని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఎక్కడ ఏ చిన్న తప్పు చేసినా ఫెయిల్ అవుతారని అంటున్నారు. అందుకే కచ్చితంగా ఈ నియమాలను పాటించాలని అంటున్నారు.

Disclaimer: ఈ కథనం వ్యక్తిత్వ వికాస నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇస్తున్నారా? అయితే ఈ అంశాలను కచ్చితంగా దృష్టిలో పెట్టుకోండి!!ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇస్తున్నారా? అయితే ఈ అంశాలను కచ్చితంగా దృష్టిలో పెట్టుకోండి!!

English summary
Are you repeatedly failing to achieve your goals? Experts say that in order to achieve what you want, you must have the qualities of setting the right goal, working with a plan, perseverance, and working with unceasing determination.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X