వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెండు బుల్లెట్లు దిగబడినా వీరోచితంగా పోరాడిన శునకం..!

|
Google Oneindia TeluguNews

మాతృదేశాన్ని రక్షించుకునే క్రమంలో ప్రాణాలు మీదకు వచ్చినా మన సైనికులు వెనకడుగు వేయకుండా వీరోచితంగా పోరాడతారు. వారి శిక్షణలో ఓ శునకం కూడా అదే తరహాలో పోరాడి వృత్తిపై తన నిబద్ధతను చాటుకుంది. జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ జాగిలం తీవ్రంగా గాయపడింది. గాయాలైనప్పటికీ అది వారితో పోరాడటంతో ఇద్దరు ఉగ్రవాదాలు హతమయ్యారు.

లష్కరే తోయిబాకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు దక్షిణ కశ్మీర్‌లోని తంగపావా ప్రాంతంలో నక్కినట్లు సైనికులకు సమాచారం అందింది. దీంతో తనిఖీలు చేపట్టిన భద్రతా బలగాలు వారిని గుర్తించే పనిని జాగిలానికి అప్పగించారు. దానిపేరు జూమ్‌.. దానికి ఎంతో కఠిన శిక్షణ ఇచ్చాం.. నిబద్ధతకు మారుపేరుగా ఉండేది.. గతంలో జరిగిన ఎన్నో ఆపరేషన్లలో కీలకంగా వ్యవహరించినట్లు అధికారులు వెల్లడించారు.

army assault dog was critically injured

తనిఖీలు చేపట్టగా జూమ్ ఉగ్రవాదులను గుర్తించి వారిపై దాడిచేసింది. పోరాటం చేసే క్రమంలోనే రెండు తుపాకీ బుల్లెట్లు దిగబడ్డాయి. అయినా వెరవకుండా అది పోరాటం సాగించింది. జూమ్ వల్ల వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న దళాలు టెర్రరిస్టులను హతమార్చాయని తెలిపారు. అనంతరం దాన్ని ఆర్మీ ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. ఇదే ఘటనలో సైనికులు కూడా గాయపడినట్లు తెలుస్తోంది. జూమ్ ఒక్కటే కాకుండా పదులసంఖ్యలో జాగిలాలకు ఇండియన్ ఆర్మీ అత్యంత కఠినమైన శిక్షణను అందిస్తోంది. వీటివల్లే గతంలోను, ప్రస్తుతం పలువురు ఉగ్రవాదుల దాడులను ఇండియన్ ఆర్మీ నిరోధించగలుగుతోంది.

English summary
Our soldiers will fight heroically without backing down even if their lives are at stake in order to protect the motherland.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X