ఘర్షణ: ఇద్దరు జవాన్లను కాల్చి చంపి, ఆత్మహత్యకు పాల్పడ్డ మరో జవాను
ధర్మశాల: హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు జవాన్లతో గొడవ పెట్టుకున్న జస్బిర్ సింగ్ అనే సిపాయి వారిపై తుపాకీతో కాల్పులు జరిపి, అనంతరం తానూ కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఈ ఘటన కాంగ్రా జిల్లా ధర్మశాల కంటోన్మెంట్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటనపై కాంగ్రా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 18 సిక్ రెజిమెంట్ జవాను జస్బిర్ సింగ్ సోమవారం తెల్లవారుజామున ఈ ఘటనకు పాల్పడ్డాడని తెలిపారు. ఈ కాల్పుల్లో హవల్దార్ హర్దీప్ సింగ్, నాయక్ హర్పాల్ సింగ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని చెప్పారు.

అనంతరం జస్బిర్ సింగ్ కూడా కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు. వారి ముగ్గురి మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. జస్బిర్ సింగ్ ఏడాదిన్నర క్రితం ఆర్మీలో చేరగా, హర్దీప్ సింగ్ 23ఏళ్లుగా, హర్పాల్ సింగ్ 18ఏళ్లుగా అందులో సేవలందిస్తున్నారు.
పని ముగించుకున్న తర్వాత తన గదికి వచ్చిన జస్బిర్ సింగ్.. ఏదో విషయంపై తన తోటి జవాన్లు హవల్దార్ హర్దీప్ సింగ్, నాయక్ హర్పాల్ సింగ్‌లతో గొడవ పెట్టుకుని, తీవ్ర ఆగ్రహానికి గురై ఈ దారుణానిిక పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తెలిసిందని కల్నల్ నవదీప్ బ్రార్ తెలిపారు. ఘటనా స్థలికి చేరుకున్న మిలటరీ అధికారులతోపాటు కాంగ్రా పోలీసులు ఘటనపై విచారణ జరుపుతున్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications