Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Article 370 రద్దు- కేంద్రం వాదనేంటి ? పిటిషనర్ల అభ్యంతరమేంటి ?

జమ్మూకశ్మీర్ ను మూడు ముక్కలుగా చేసి ఆర్టికల్ 370 రద్దుపై కేంద్ర ప్రభుత్వం, పిటిషనర్లు ఇప్పటికే తమ వాదనలు వినిపించాయి. ఇందులో కేంద్రం ఆర్టికల్ 370 రద్దు చేయాలన్న తమ నిర్ణయాన్ని సమర్ధించుకోగా.. పిటిషనర్లు మాత్రం దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే ఇవాళ సుప్రీంకోర్టులో దీనిపై కీలక తీర్పు వెలువడనున్న నేపథ్యంలో.. గతంలో విచారణ సందర్భంగా రెండు వర్గాలు వినిపించిన ఓ వాదనల్ని ఓసారి పరిశీలిద్దాం..

కేంద్రం నాలుగేళ్ల క్రితం అంటే 2019 ఆగస్టులో జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370ని పార్లమెంటు నిర్ణయం ద్వారా రద్దు చేసింది. దీంతో పాటే దీనికి అనుబంధంగా ఉన్న ఆర్టికల్ 35ఏ కూడా రద్దయింది. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన పిటిషనర్లు తమ వాదనలు వినిపించారు. ఇందులో వారు ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ రాజ్యాంగ సవరణ చేపట్టడానికి రాష్ట్ర శాసనసభ అభిప్రాయాన్ని పార్లమెంటు స్వీకరించాలని, భారత ప్రభుత్వానికి, రాష్ట్రానికి మధ్య రాజ్యాంగ సభ ఉంటుందని, ఆర్టికల్ 370ని ముట్టుకోవాలంటే దాని అభిప్రాయం తప్పనిసరి అని వాదించారు.

Article 370 Case: these are the arguments of centre and petitioners in supreme court

జమ్మూ కశ్మీర్ పై నిర్ణయం తీసుకున్న రాజ్యాంగ సభ 1957లో రద్దయింది. అయితే పార్లమెంటు తీర్మానం ద్వారా అది రాజ్యాంగ సభ అని చెప్పలేమని, ఆర్టికల్ 370ని సవరించడం లేదా రద్దు చేయడంపై నిర్ణయాలు రాజకీయ ప్రక్రియ ద్వారా మాత్రమే తీసుకోవచ్చని వారు వాదించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా తమ వాదనలు వినిపించింది. అనంతరో సుప్రీంకోర్టు తీర్పును రిజర్వు చేసింది.

కేంద్ర ప్రభుత్వ వాదన ప్రకారం ఆర్టికల్ 370(3)లోని 'రాజ్యాంగ సభ' అనే పదాన్ని 'లెజిస్లేటివ్ అసెంబ్లీ' అని మాత్రమే భావించాలని ప్రభుత్వం తెలిపింది. ఆగస్టు 2019లో జమ్మూ కశ్మీర్ లో రాష్ట్రపతి పాలన అమలులో ఉందని, కాబట్టి అప్పుడు ఉన్న రాష్ట్ర గవర్నర్ శాసనసభ అధికారాలను స్వీకరించారని తెలిపింది. గవర్నర్ తరపున ఆర్టికల్‌ను రద్దు చేయాలని పార్లమెంటు సిఫార్సు చేసిందని తెలిపింది. జమ్మూ కాశ్మీర్‌కు కేంద్ర పాలిత హోదా తాత్కాలిక చర్య అని, దాని రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+