అరుణ్‌జైట్లీ మృతి..! సంతాపం తెలిపిన కేసీఆర్, జగన్ తో పాటు ప్రముఖుల నేతలు..!!
Recommended Video
న్యూఢిల్లీ/హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. జైట్లీ మరణంపై పలువురు రాజకీయ ప్రముఖులు, పలు రాష్ట్రాల ముఖ్య మంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జైట్లీ మరణం పట్ల రాష్ట్ర పతి రాంనాధ్ కోవింద్, ఉపరాష్ట్ర పతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు, ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డి, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
దేశానికి ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు, కేటీఆర్ స్మరించుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతున్ని ప్రార్ధించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అంతే కాకుండా ఏపీ సీఎం జగన్ సంతాపాన్ని తెలుపుతూ రాజకీయాల్లో సుధీర్గ నేతగా కొనసాగిన నేత, న్యాయ కోవిదుడు జైట్లీ మరణం దేశానికి పూడ్చలేనిదని తెలిపారు.ఇదిలా ఉండగా ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న అరుణ్ జైట్లీ కన్నుమూసినట్లు ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. ఈ నెల 9న ఆసుపత్రిలో చేరిన అరుణ్ జైట్లీ శనివారం మధ్యాహ్నం 12.09 గంటలకు తుదిశ్వాస విడిచారు.

అరుణ్‌జైట్లీ మృతికి ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. అరుణ్‌జైట్లీ మృతి పట్ల దేశంలోని ప్రముఖ రాజకీయ నేతలతో పాటు న్యాయ నిపుణులు తీవ్ర సంతాపం తెలిపారు. అంతే కాకుండా తెలంగాణ బీజేపీ నేత లక్ష్మణ్, కిషన్‌రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, దత్తాత్రేయ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. అరుణ్ జైట్లీతో తమకు ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా జైట్లీ మృతిపట్ల తమ ప్రగాఢ సానుభూతీని తెలిపారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, శశి థరూర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద కేజ్రీవాల్ తమ సంతాపాన్ని వ్యక్తం చేసారు.
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications