బీజేపీలో చేరితే రూ.20 కోట్లు-ఇతరుల్ని తెస్తే రూ.25 కోట్లు-ఆప్ ఎమ్మెల్యేలకు ఆఫర్లపై కేజ్రివాల్
ఢిల్లీని దాటి పంజాబ్ లో అధికారం అందుకున్న ఆప్ వచ్చే ఎన్నికల నాటికి తమకు పోటీగా మారుతుందన్న భయంతో బీజేపీ బెదిరింపులకు దిగుతోంది. ఆప్ ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నిస్తోంది.తద్వారా పార్టీని చీల్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఢిల్లీ సీఎం కేజ్రివాల్ ఇవాళ ఆరోపించారు.
ఒక్కో ఆప్ ఎమ్మెల్యేకు పార్టీలో చేరితే రూ.20 కోట్లు, ఇతరుల్ని చేరిస్తే మరో రూ.25 కోట్లు ఇస్తామంటూ బీజేపీ ఆఫర్లు పంపుతోందని ఢిల్లీ సీఎంకేజ్రివాల్ ఆరోపించారు. ఈ మేరకు ఎమ్మెల్యేల్ని ఆప్ ను చీల్చాలంటూ బెదిరిస్తోందని కేజ్రివాల్ తెలిపారు. తాజా రాజకీయ పరిణామాలపై ఆప్ రాజకీయ వ్యవహారాల కమిటీ సాయంత్రం సమావేశమై చర్చించనుందని కేజ్రివాల్ వెల్లడించారు.

రెండు రోజుల క్రితం, ఎక్సైజ్ విధానం 2021-22 అమలులో అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, బీజేపీ తనకు సీఎం పదవిని ఆఫర్ చేసిందని, ఆప్ ను వీడితే అన్ని కేసులను ఎత్తేస్తామని ఆఫర్ చేసినట్లు సంచలన ఆరోపణలు చేశారు. ఇవాళ కేజ్రివాల్ మిగతా ఎమ్మెల్యేలను కూడా బీజేపీ బెదిరిస్తోందని, ఇలాంటి ఆఫర్లే ఇస్తోందని ఆరోపించారు. దీంతో ఢిల్లీలో ఏం జరుగుతుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.
ఆప్ ఎమ్మెల్యేలు అజయ్ దత్, సంజీవ్ ఝా, సోమనాథ్ భారతి, కుల్దీప్‌లను బీజేపీ నేతలు సంప్రదించారని.. వారితో తమకు స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయని ఆప్ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ ఎంపి సంజయ్ సింగ్ చెప్పారు. పార్టీలో చేరితే ఒక్కొక్కరికి ₹ 20 కోట్లు, ఇతర ఎమ్మెల్యేలను తమ వెంట తీసుకువస్తే ₹ 25 కోట్లు ఇస్తామని ఆఫర్ చేశారని సింగ్ ఆరోపించారు.సీబీఐ దాడుల గురించి ప్రశ్నించగా, ఈ ఏడాది చివర్లో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల వరకు విచారణ, దాడులు కొనసాగుతాయని చెప్పారు.
-
ఉరుములు, పిడుగులతో భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరికలు జారీ.. -
ఏసీ గదుల్లో ఎక్కువగా ఉంటున్నారా- అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కిర్రాక్ ఫీచర్లతో Boat Valour Watch 1R.. ధర ఎంతంటే ?? -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ












Click it and Unblock the Notifications